Loading...
Trump: బ్రిటన్‌ నుంచి వెనక్కి అమెరికా బాంబర్లు.. ఇరాన్‌ ముప్పే కారణమన్న ట్రంప్
బ్రిటన్‌ నుంచి వెనక్కి అమెరికా బాంబర్లు.. ఇరాన్‌ ముప్పే కారణమన్న ట్రంప్

Trump: బ్రిటన్‌ నుంచి వెనక్కి అమెరికా బాంబర్లు.. ఇరాన్‌ ముప్పే కారణమన్న ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సంబంధం ఉన్న ముప్పు కారణంగానే బ్రిటన్‌లోని రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (RAF) ఫెయిర్‌ఫోర్డ్‌ వైమానిక స్థావరం నుంచి అమెరికా బీ-1 బాంబర్‌ యుద్ధవిమానాలను వెనక్కి తరలించినట్లు తెలిపారు. ఫెయిర్‌ఫోర్డ్‌ స్థావరంపై ఉగ్రదాడికి కుట్ర జరిగిందన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ''అక్కడ ముప్పు ఉండొచ్చని మాకు సమాచారం వచ్చింది. అలాంటప్పుడు వాటిని అక్కడే ఎందుకు ఉంచాలి?'' అని ట్రంప్‌ విలేకరులతో అన్నారు. ఈ విషయాన్ని రాయిటర్స్‌ కూడా నివేదించింది.

వివరాలు 

అమెరికాకు బాంబర్లను తరలించిన పెంటగాన్

ఫెయిర్‌ఫోర్డ్‌లో అనుమానాస్పద ఉగ్ర కుట్రపై దర్యాప్తు నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా బాంబర్‌ విమానాలను తిరిగి అమెరికాలోని వాటి సొంత స్థావరాలకు తరలించినట్లు పెంటగాన్‌ ధ్రువీకరించింది.

అమెరికాపై ఇరాన్‌ లేదా ఇరాన్‌కు సంబంధించిన వర్గాల నుంచి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు.

వివరాలు 

ఉగ్ర కుట్ర అనుమానంతో బ్రిటన్‌-ఇరాన్‌ ద్వంద్వ పౌరుడి అరెస్టు

ఇటీవల లండన్‌లో బ్రిటన్‌, ఇరాన్‌ రెండు దేశాల పౌరసత్వం ఉన్న వ్యక్తిని ఉగ్రదాడికి కుట్ర పన్నిన అనుమానంతో అరెస్టు చేశారు.

ఫెయిర్‌ఫోర్డ్‌ స్థావరానికి సమీపంలో గతంలో ఐదుగురు బ్రిటన్‌ పౌరులను కూడా ఉగ్రవాదం, పేలుడు పదార్థాలకు సంబంధించిన అనుమానాలపై అదుపులోకి తీసుకున్నారు.

అయితే వారిని తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ కేసులో ఇరాన్‌ ప్రమేయం ఉందా అనే కోణంలో బ్రిటన్‌, అమెరికా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్‌పై దాడుల్లో పాల్గొన్న బీ-1 బాంబర్లు

అమెరికా బీ-1 బాంబర్‌ విమానాలు ఇటీవల ఇరాన్‌పై చేపట్టిన దాడుల్లో పాల్గొన్నాయి.

ఆ తర్వాతే వాటిని బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్‌ స్థావరం నుంచి అమెరికాకు తరలించారు.

యూరప్‌లో అమెరికా బాంబర్‌ విమానాలకు ఫెయిర్‌ఫోర్డ్‌ కీలక స్థావరంగా ఉంది.

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు ఈ స్థావరాన్ని గతంలోనూ ఉపయోగించారు.

ADVERTISEMENT

వివరాలు 

బాంబర్ల తరలింపునకు ఇరాన్‌ కుట్రతో నేరుగా సంబంధం లేదు: రూబియో

అయితే బాంబర్‌ విమానాలను వెనక్కి తరలించడానికి, ఫెయిర్‌ఫోర్డ్‌లో జరిగినట్లు అనుమానిస్తున్న ఇరాన్‌ సంబంధిత కుట్రకు నేరుగా సంబంధం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో పేర్కొన్నారు.

సైనిక విమానాలు, ఇతర వనరులను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తరలించడం సాధారణ ప్రక్రియలో భాగమేనని ఆయన వివరించారు.

సైనిక విన్యాసాలు, పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది మార్పులు, కొత్త విమానాల రాక, పాత విమానాల తరలింపు వంటి కారణాలతో ఈ మార్పులు జరుగుతుంటాయని తెలిపారు.

వివరాలు 

ఫెయిర్‌ఫోర్డ్‌ ఘటనలో ఇరాన్‌ ప్రమేయాన్ని ఖండించిన  అబ్బాస్‌ అరాఘ్చీ 

ఇదిలా ఉండగా, ఫెయిర్‌ఫోర్డ్‌ వైమానిక స్థావరంలో జరిగిన ఘటనకు ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఆరోపణలను ఖండించారు.

బ్రిటన్‌, అమెరికా అధికారులు ఇరాన్‌ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. తమ దేశానికి సంబంధం లేదని టెహ్రాన్‌ స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఘటన వెనుక ఉన్న కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT