US: కాలిఫోర్నియాలో 49 అక్రమ వలసదారులు అరెస్ట్.. వీరిలో 30 మంది భారతీయులు
ఈ వార్తాకథనం ఏంటి
కాలిఫోర్నియాలోని ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద యూఎస్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నారని CBP పేర్కొంది. అధికారుల ప్రకారం, కొందరు సెమీ ట్రక్కులను నడిపే కమర్షియల్ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారిగా ఉన్నారు, మరికొందరు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిగా గుర్తించబడ్డారు. ఇప్పటివరకు అమెరికాలో జరిగిన కొన్ని ట్రక్కు ప్రమాదాల కారణంగా,డొనాల్డ్ ట్రంప్ సర్కారు విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసా మరియు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, కమర్షియల్ లైసెన్స్‌తో సెమీ ట్రక్కులు నడిపే వలసదారులపై ప్రత్యేక దృష్టి సారించబడింది.
వివరాలు
హైవే సెంటినెల్' ఆపరేషన్‌లో మరో 7 మంది అక్రమ వలసదారులు
నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య జరగిన ఆపరేషన్‌లో, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ తో సెమీ ట్రక్కులు నడిపిన 42 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. వీరిలో 30 మంది భారతీయులు, మిగతా వారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే వంటి దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. తదుపరి కాలిఫోర్నియాలో వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన 'హైవే సెంటినెల్' ఆపరేషన్‌లో మరో 7 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 49కు చేరింది. అధికారులు ఈ చర్యల వల్ల వలస చట్ట ఉల్లంఘనలను నియంత్రించడం, రాష్ట్ర హైవేలను భద్రపరచడం సులభమవుతుందని పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాలిఫోర్నియాలో 30 మంది భారతీయుల అరెస్టు
US border patrol agents arrest 30 Indians living illegally in the countryhttps://t.co/bVRZbJbwjj
— Economic Times (@EconomicTimes) December 24, 2025