LOADING...
MQ-4C Triton drone: పర్షియన్ గల్ఫ్‌లో కుప్పకూలిన 240 మిలియన్ డాలర్ల డ్రోన్ .. ధృవీకరించిన అమెరికా
ధృవీకరించిన అమెరికా

MQ-4C Triton drone: పర్షియన్ గల్ఫ్‌లో కుప్పకూలిన 240 మిలియన్ డాలర్ల డ్రోన్ .. ధృవీకరించిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
06:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నౌకాదళం పర్షియన్ గల్ఫ్‌లో అత్యంత ఖరీదైన MQ-4C ట్రిటాన్ డ్రోన్ కుప్పకూలిన ఘటనను అధికారికంగా ధృవీకరించింది. ఏప్రిల్ 9న ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. ఇది భారీ నష్టం కలిగించిన ప్రమాదంగా గుర్తించారు. దాదాపు 238 మిలియన్ డాలర్ల విలువైన ఈ డ్రోన్ హోర్ముజ్ జలసంధిలో సాధారణ పర్యవేక్షణ మిషన్‌లో ఉండగా అత్యవసర సంకేతాలు పంపడం ప్రారంభించింది. 50 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ డ్రోన్ ఒక్కసారిగా 10 వేల అడుగుల కంటే తక్కువకు పడిపోయి ఆ తర్వాత పూర్తిగా కనపడకుండా పోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అమెరికా భద్రతా విభాగం తెలిపింది.

వివరాలు 

24 గంటలకుపైగా గాల్లో ఉండగల డ్రోన్ 

మొదట ఇరాన్ దాడి కారణమని అనుమానాలు వచ్చినా, ఇది కేవలం ప్రమాదమేనని అమెరికా స్పష్టం చేసింది. సముద్ర పర్యవేక్షణ కోసం రూపొందించిన ఈ అధునాతన డ్రోన్ 24 గంటలకుపైగా గాల్లో ఉండగలదు. ఇలాంటి ఖరీదైన డ్రోన్ కోల్పోవడం అమెరికాకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య అమెరికా పలు డ్రోన్లు కోల్పోయినట్లు వార్తలు వెలువడ్డాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పర్షియన్ గల్ఫ్‌లో కుప్పకూలిన అమెరికా ఖరీదైన డ్రోన్

Advertisement