LOADING...
Chabahar Port: చాబహార్‌ పోర్ట్‌పై అమెరికా మినహాయింపు.. భారత్‌కు పెద్ద ఊరట
చాబహార్‌ పోర్ట్‌పై అమెరికా మినహాయింపు.. భారత్‌కు పెద్ద ఊరట

Chabahar Port: చాబహార్‌ పోర్ట్‌పై అమెరికా మినహాయింపు.. భారత్‌కు పెద్ద ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు (Iran's Chabahar Port) విషయంలో భారత్‌కు పెద్ద ఊరట లభించింది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఈ పోర్టు అమెరికా ఆంక్షల నుండి మినహాయింపును పొందింది. అమెరికా గతంలో ఇచ్చిన మినహాయింపు గడువు ఈరోజుతో ముగియగా, మరోసారి ఆ గడువును పొడిగించింది. దీంతో చాబహార్‌ పోర్టులోని షహీద్‌ బెహెస్తీ టెర్మినల్‌ అభివృద్ధి మరియు నిర్వహణ కార్యక్రమాలను భారత్‌ కొనసాగించే అవకాశం దక్కింది . మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను కొనసాగించడానికి చాబహార్‌ పోర్టు భారత్‌కు కీలక కేంద్రంగా మారింది. ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో భారత్‌ ప్రధాన భూమికను పోషిస్తోంది. ఇప్పటికే న్యూఢిల్లీ ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది.

వివరాలు 

అమెరికా భారత్‌కు హెచ్చరికలు

కజఖిస్తాన్‌,కిర్గిజ్‌ రిపబ్లిక్‌,తజికిస్తాన్‌,తుర్క్‌మెనిస్తాన్‌,ఉజ్బెకిస్తాన్‌ వంటి దేశాలకు భారత సరుకులను ఇక్కడినుంచి రవాణా చేయవచ్చు. అలాగే పాకిస్థాన్‌ భూభాగం గుండా కాకుండా అఫ్గానిస్థాన్‌కు భారత ప్రభుత్వం పంపే ఆహార ధాన్యాలు కూడా ఈ మార్గం ద్వారానే చేరుతున్నాయి. ఇదిలా ఉండగా,ఈఓడరేవులోని టెర్మినల్‌ను 10ఏళ్ళపాటు నిర్వహించేందుకు గత సంవత్సరం భారత్‌-ఇరాన్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈఒప్పందం తర్వాత అమెరికా భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. "ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయి.టెహ్రాన్‌తో వ్యాపార లావాదేవీలు చేసే ఏ సంస్థైనా,దేశమైనా ఆఆంక్షల పరిధిలోకి వస్తారు"అని అమెరికా ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పందిస్తూ,"చాబహార్‌ పోర్ట్‌ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదు.ఇది ప్రాంతీయ సహకారం,అభివృద్ధి కోసం తీసుకున్న కీలక అడుగు"అని కౌంటర్‌ ఇచ్చారు.