LOADING...
US: కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-16 జెట్ విమానం.. పారాచ్యూట్‌ సాయంతో సురక్షితంగా బయటపడ్డ పైలట్ 
పారాచ్యూట్‌ సాయంతో సురక్షితంగా బయటపడ్డ పైలట్

US: కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-16 జెట్ విమానం.. పారాచ్యూట్‌ సాయంతో సురక్షితంగా బయటపడ్డ పైలట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-16సీ ఫైట్‌ర్ జెట్ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ బెర్నాడినో కౌంటీలో ఉన్న ట్రోనా విమానాశ్రయం పరిసర ప్రాంతంలో కూలిపోయింది. బుధవారం దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనను సైన్యం అధికారికంగా ధృవీకరించింది. ప్రమాద సమయంలో విమానాన్ని నడిపిన పైలట్ వెంటనే పారాచ్యూట్ ఉపయోగించి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు

ఈ ప్రమాదానికి గురైన ఎఫ్-16సీ ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానం నెవాడాలో ఉన్న నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చెందిన ప్రసిద్ధ "ఎయిర్ ఫోర్స్ థండర్‌బర్డ్స్" స్క్వాడ్రన్‌కు కేటాయించబడిందని యూఎస్ ఎయిర్ ఫోర్స్ సార్జెంట్ జోవాంటే జాన్సన్ తెలిపారు. శిక్షణా మిషన్‌లో భాగంగా బుధవారం స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:45 గంటల సమయంలో ఈ జెట్ కూలిపోయిందని సమాచారం. ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనను అక్కడే రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న 60 ఏళ్ల డారెన్ స్ప్రింగర్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు.

వివరాలు 

సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

పొగలు కమ్ముకుంటూ జెట్ విమానం ఎడారి ప్రాంతంలో కూలిపోతున్న దృశ్యాలు తన కళ్లముందే చూసినట్లు అతను చెప్పాడు. ఆ దృశ్యం తనకు గుండె ఆగినట్టుగా అనిపించిందని డారెన్ వ్యాఖ్యానించాడు. అలాగే, ప్రమాదానికి కొద్దిసేపటి ముందు అదే ప్రాంతంలో నాలుగు థండర్‌బర్డ్ విమానాలు గాల్లో సంచరిస్తున్నట్లు గమనించినట్లు తెలిపాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-16 జెట్ విమానం

Advertisement