F-35 Lightning II: ఇరాన్ దాడిలో దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 .. తీవ్ర ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు ఒక్కసారిగా ఉద్ధృతమయ్యాయి. ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానంగా గుర్తింపు పొందిన అమెరికా 'ఎఫ్-35 లైట్నింగ్ II' పెద్ద ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకుంది. ఇరాన్‌పై సైనిక దాడి పూర్తి చేసి తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇరాన్ దళాల కాల్పుల వల్లే విమానం దెబ్బతిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పైలట్ అప్రమత్తంగా స్పందించి, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఒకవేళ ఈ దాడికి ఇరాన్ కారణమని నిర్ధారణ అయితే, ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ విమానాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకున్న తొలి ఘటనగా ఇది నిలవనుంది.
వివరాలు
10 రీపర్ డ్రోన్లు సహా మొత్తం 16 అమెరికా విమానాలకు నష్టం
దాదాపు 100 మిలియన్ డాలర్ల (రూ.800 కోట్లకు పైగా) విలువ గల ఈ విమానం సురక్షితంగా దిగిందని, పైలట్ క్షేమంగా ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 రీపర్ డ్రోన్లు సహా మొత్తం 16 అమెరికా విమానాలు నష్టపోయాయి. ఇక ఈ పరిణామాలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. పెంటగాన్‌లో మీడియాతో మాట్లాడిన రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" విజయవంతంగా కొనసాగుతోందని, యుద్ధంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. అంతేకాకుండా, ఇరాన్ ఇప్పటివరకు చూడని స్థాయిలో భారీ వైమానిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వివరాలు
'ఎస్-400తో పాటు 'బావర్-373
ఇదిలా ఉండగా, ఇరాన్ తన గగనతల రక్షణను మరింత బలోపేతం చేసింది. ఎస్-400తో పాటు 'బావర్-373' వ్యవస్థలను యుద్ధ స్థాయిలో అమర్చింది. అమెరికా యుద్ధ విమానాన్ని తామే దెబ్బతీశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సోషల్ మీడియాలో పేర్కొంటూ సంబరాలు జరుపుతున్నాయి.