LOADING...
US: అమెరికాలో ప్రకృతి విలయం.. కార్చిచ్చు, వరదలతో ఏడుగురు మృతి
అమెరికాలో ప్రకృతి విలయం.. కార్చిచ్చు, వరదలతో ఏడుగురు మృతి

US: అమెరికాలో ప్రకృతి విలయం.. కార్చిచ్చు, వరదలతో ఏడుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఒకేసారి రెండు విభిన్న ప్రకృతి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో కార్చిచ్చు ఉద్ధృతంగా వ్యాపిస్తుండగా,తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కొలరాడో-యుటా సరిహద్దులోని నోల్స్, గోర్ ప్రాంతాల అడవులు,పర్వత ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సాగిన సహాయక చర్యల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సిబ్బంది గాయపడినట్లు యూఎస్ వైల్డ్‌ల్యాండ్ ఫైర్ సర్వీస్ ఆదివారం వెల్లడించింది. మంటలను అదుపు చేసేందుకు వివిధ అగ్నిమాపక దళాలతో కలిసి తమ సిబ్బంది కూడా నిరంతరం పనిచేస్తున్నట్లు సంబంధిత ఏజెన్సీ తెలిపింది. ఇదే సమయంలో యుటా, ఆరిజోనా రాష్ట్రాల్లోని అడవుల్లో కూడా కార్చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది.

వివరాలు 

కెంటకీ రాష్ట్రంలో భారీ వర్షాలు 

శనివారం నాటికి సుమారు 144 చదరపు మైళ్లు (దాదాపు 373 చదరపు కిలోమీటర్లు) కంటే ఎక్కువ విస్తీర్ణం మంటల బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. కార్చిచ్చు వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అగ్నిమాపక బృందాలతో కలిసి అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ఉద్ధృతంగా మారాయి. ఈ వరదల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement