Abdul El-Sayed: అమెరికా రాజకీయాల్లో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ ఎల్ సయ్యద్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మిచిగన్ రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయ్యద్ సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రిపబ్లికన్ నేత మైక్ రోజర్స్‌పై ఆయన గెలుపొందినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో అమెరికా చరిత్రలో సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా అబ్దుల్ ఎల్ సయ్యద్ రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. తాజా మధ్యంతర ఎన్నికల్లో పలు చారిత్రక విజయాలు నమోదవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పాలనపై అసంతృప్తితో ఉన్న ఓటర్లు తమ తీర్పును వెల్లడిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
హోరాహోరీ పోరులో అబ్దుల్ విజయం
తొలి ముస్లిం సెనేటర్‌తో పాటు తొలి నల్లజాతి మహిళా గవర్నర్, తొలి గే పురుష సెనేటర్, తొలి మహిళా స్థానిక అమెరికన్ గవర్నర్‌గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్లు సమాచారం.
వామపక్ష భావజాలం కలిగిన అబ్దుల్ ఎల్ సయ్యద్ మిచిగన్‌లో హోరాహోరీ పోటీని ఎదుర్కొన్నారు.
వైద్య పరిపాలన రంగంలో పనిచేసిన ఆయన ఎన్నికల ప్రచారంలో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ హామీతో పెద్ద సంఖ్యలో ఓటర్లను ఆకర్షించారు. మిచిగన్‌లో ఇప్పటివరకు 78 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది.
అందుబాటులో ఉన్న ఫలితాల ప్రకారం అబ్దుల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
వివరాలు
హోరాహోరీ పోరులో అబ్దుల్ విజయం
తనకు మద్దతుగా నిలిచిన వారిని ఉద్దేశించి అబ్దుల్ సయ్యద్ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ తాను విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు.
మిచిగన్ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మత విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.
వివరాలు
భారత్‌తో అనుబంధం
అబ్దుల్ ఎల్ సయ్యద్‌కు భారత్‌తో కుటుంబపరమైన అనుబంధం ఉంది.
ఆయన భార్య డాక్టర్ సారా జుకాకు కర్ణాటకలోని తీర ప్రాంతానికి చెందినవారు. ఆమె మానసిక వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
మంగళూరుకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న భట్కల్‌లో సారా కుటుంబ మూలాలు ఉన్నాయి.
గతంలో ముఖ్యమంత్రి బీడీ జెట్టి వద్ద ఆర్థిక శాఖ ఉపమంత్రిగా పనిచేసిన జుకాకు షాంషుద్దిన్ మనవరాలే సారా.
వివరాలు
భారత్‌తో అనుబంధం
మిచిగన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో అబ్దుల్ ఎల్ సయ్యద్, సారా మధ్య పరిచయం ఏర్పడింది.
దక్షిణ భారత కుటుంబం, సంస్కృతి గురించి తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు అబ్దుల్ పలు సందర్భాల్లో వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను అరబ్ కంటే ఎక్కువగా భారతీయుడిగా మారిపోయానని వ్యాఖ్యానించారు.
సారాకు భట్కల్‌తో కుటుంబ అనుబంధం ఉన్నప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడినట్లు తెలుస్తోంది.