USA: 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 23, 2026
09:14 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నది తెలిసిందే. ఈ క్రమంలో, అమెరికాలో ఐదు సంవత్సరాల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. మిన్నెసోటా రాష్ట్రంలోని ఒక ప్రీస్కూల్ నుండి ఇంటికి తిరుగుతున్న సమయంలో ఆ చిన్నారిని, అతడి తండ్రిని ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ప్రీస్కూల్ వర్గాలు,బాధిత కుటుంబ న్యాయవాది వివరాల ప్రకారం, వారిని తర్వాత టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారట.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మిన్నెసోటాలో సంచలన ఘటన
DHS refutes public school official’s claim that ICE agents used immigrant’s 5-year-old son as ‘bait’https://t.co/w6630KszjD pic.twitter.com/E0KupFJwM6
— The Washington Times (@WashTimes) January 23, 2026