LOADING...
F-35 Fighter Jet: ఇరాన్‌లో కూలిన ఎఫ్-35.. పైలట్ కోసం అమెరికా ముమ్మర గాలింపు
ఇరాన్‌లో కూలిన ఎఫ్-35.. పైలట్ కోసం అమెరికా ముమ్మర గాలింపు

F-35 Fighter Jet: ఇరాన్‌లో కూలిన ఎఫ్-35.. పైలట్ కోసం అమెరికా ముమ్మర గాలింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
07:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధవిమానం కూలిపోవడంతో, అందులోని పైలట్‌ను రక్షించేందుకు అమెరికా సైన్యం తీవ్రంగా శోధన చర్యలు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. పశ్చిమ ఇరాన్‌లోని కోగిలుయే,బోయర్-అహ్మద్ ప్రావిన్సుల పరిధిలో శుక్రవారం నుంచి అమెరికా దళాలు విస్తృతంగా గాలింపు ప్రారంభించాయి. ఈ గాలింపు చర్యల్లో బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, సీ-130 హెర్క్యులస్ రవాణా విమానాలు వినియోగిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లభించలేదని నివేదిక పేర్కొంది.

వివరాలు 

పైలట్ ఇరాన్ సైన్యం అదుపులో ఉండొచ్చన్న అనుమానం

ఇక మరోవైపు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో తమ ఆధునిక రక్షణ వ్యవస్థలతో అమెరికాకు చెందిన రెండో ఎఫ్-35 యుద్ధవిమానాన్ని కూల్చివేశామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. లేకెన్‌హీత్ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ యుద్ధవిమానం పూర్తిగా ధ్వంసమై కూలిపోయిందని తెలిపింది. అయితే, విమానం నుంచి బయటపడిన పైలట్ పారాచూట్ సహాయంతో ఇరాన్ భూభాగంలోనే దిగినట్లు సమాచారం వెలువడింది. పైలట్ సురక్షితంగానే ఉన్నాడని భావిస్తున్న అమెరికా, అతడిని త్వరగా ఇరాన్ సరిహద్దుల నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, ఆ పైలట్ ఇప్పటికే ఇరాన్ సైన్యం అదుపులోకి వెళ్లి ఉండొచ్చని కొన్ని వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయని తస్నిమ్ తన కథనంలో పేర్కొంది.

వివరాలు 

అమెరికా ఎఫ్-16 యుద్ధవిమానం, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ కూల్చివేశామన్న  ఐఆర్‌జీసీ

ఇటీవల జరిగిన పరిణామాల్లో భాగంగా, గత వారం ఒక అమెరికా ఎఫ్-16 యుద్ధవిమానం, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూడా కూల్చివేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్, దాని మిత్రదేశాలు కూడా మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ప్రతిదాడులు చేపడుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే తాజా ఘటన చోటుచేసుకుంది.

Advertisement