Page Loader
High alert: అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత.. పలుచోట్ల హై అలర్ట్‌ ప్రకటించిన యూఎస్‌!
అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత.. పలుచోట్ల హై అలర్ట్‌ ప్రకటించిన యూఎస్‌!

High alert: అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత.. పలుచోట్ల హై అలర్ట్‌ ప్రకటించిన యూఎస్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ (Iran vs Israel) యుద్ధం తీవ్రతరం కావడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలో భాగస్వామ్యం కావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. 'అమెరికా దాడులు మొదలు పెట్టింది. ఇప్పుడు మేమే ముగింపు ఇస్తామని ఇరాన్‌ తాజాగా హెచ్చరించింది. దీంతో ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో అమెరికా పాలకులు హైఅలర్ట్‌ (High Alert) ప్రకటించారు. ఆదివారం అమెరికా ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై ప్రత్యక్ష దాడులు జరిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా పలు నగరాల్లో హై అలర్ట్‌ విధించింది.

Details

అమెరికాలో అప్రమత్తత

ఇరాన్‌ ప్రతీకార దాడులకు పూనుకుంటుందనే భయంతో అమెరికా అంతటా అప్రమత్తత పెరిగింది. పౌరులకు ముప్పు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ భాగంలో ప్రార్థనా స్థలాలు, సున్నిత ప్రాంతాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. వాషింగ్టన్‌తో పాటు పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. న్యూయార్క్‌ పోలీస్‌ అధికారులు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ''ఇరాన్‌ తాజా దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు, రాయబార కార్యాలయాల చుట్టూ భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశామని తెలిపారు.