LOADING...
US-Iran War: ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్‌ మరోసారి పొడిగింపు?
ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్‌ మరోసారి పొడిగింపు?

US-Iran War: ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్‌ మరోసారి పొడిగింపు?

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు కొనసాగించే దిశగా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్‌ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై కొత్తగా సంప్రదింపులు ప్రారంభించేందుకు కూడా తాత్కాలిక అవగాహనకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ఉద్రిక్త పరిస్థితులు కొంతమేర తగ్గే అవకాశం

అయితే ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం తెలపాల్సి ఉందని తెలుస్తోంది. ఇటీవల ఇరాన్‌, అమెరికా మధ్య జరిగిన దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రయత్నాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ చర్చలు సఫలమైతే ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంతమేర తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement