US-Iran War: ఇరాన్ కాన్సర్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి..
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని అహ్వాజ్ నగరంలో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. ముఖ్యంగా క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న రోగులు, కీమోథెరపీ తీసుకుంటున్న చిన్నారులను భద్రతా కారణాల దృష్ట్యా వైద్య సిబ్బంది వెంటనే మరో ప్రాంతానికి తరలించారు. గత 24 గంటల వ్యవధిలో అమెరికా ఇరాన్‌పై రెండు భారీ దాడులు నిర్వహించినట్లు సమాచారం.
వివరాలు
హోర్ముజ్ జలసంధి లక్ష్యంగా సైనిక చర్యలు
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ సైనిక ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపడుతున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
అహ్వాజ్‌తో పాటు బందర్ అబ్బాస్, చబహార్, బుషెహర్ నగరాల్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.
వివరాలు
చమురు ట్యాంకర్‌పై కూడా దాడి
ఇరాన్ ఓడరేవుల సమీపంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'ఎం/టి బెల్మా' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా యుద్ధ విమానాలు క్షిపణులతో లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సమాచారం.
అయితే ఈ దాడుల్లో ఆస్పత్రికి ఎంత మేర నష్టం జరిగింది, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇరాన్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి
BREAKING: US missiles have struck a children's cancer hospital in Ahvaz, southwestern Iran, with patients being evacuated minutes ago, per Fars.
— The Hormuz Letter (@HormuzLetter) July 15, 2026
This is the first US strike on an Iranian hospital in months, with additional strikes also causing damage to multiple residential… pic.twitter.com/GBTXy5TQiT