Page Loader
US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు 
US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు

US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు 

వ్రాసిన వారు Stalin
Nov 21, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా విమానం సముద్రంలో కుప్ప కూలింది. రన్‌వే నుంచి అదుపుతప్పి..నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన హోనోలులుకు 10మైళ్ల దూరంలో ఉన్న యూఎస్ మెరైన్ బేస్ వద్ద జరిగింది. ఈ ఘటన సమయంలో విమానంలో 9మందిని కమాండోలు ఉన్నారు. వీరు ఈత కొట్టుకుంటూ.. పడవల ద్వారా ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యూఎస్ నేవీకి చెందిన P-8Aవిమానం అదుపుతప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో విజిబిలిటి లేక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే విమానం కూలి.. సమద్రంలో తేలడంతో అక్కడం బోటింగ్ చేస్తున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నీటిపై తేలుతున్న విమానం