LOADING...
H-1B visa: ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి కొత్త విధానం.. వీసాల జారీలో లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పనున్న అమెరికా 
వీసాల జారీలో లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పనున్న అమెరికా

H-1B visa: ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి కొత్త విధానం.. వీసాల జారీలో లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పనున్న అమెరికా 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా హెచ్‌-1బీ వీసాల జారీ విధానంలో ముఖ్యమైన మార్పులు చేయడానికి సిద్దమవుతోంది. ప్రస్తుత ర్యాండమ్‌ లాటరీ విధానాన్ని వదిలి, ఎక్కువ నైపుణ్యాలు కలిగిన,అధిక వేతనాలు పొందే అభ్యర్థులకే ప్రాధాన్యమిచ్చే సరి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుండి అమల్లోకి వచ్చే విధంగా నిబంధనలు రూపొందించారు.

వివరాలు 

లాటరీ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న చాలా కంపెనీలు

2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్‌-1బీ క్యాప్‌ రిజిస్ట్రేషన్‌ సీజన్‌కు కూడా ఇదే కొత్త విధానం వర్తించనుందని డీహెచ్‌ఎస్‌ స్పష్టం చేసింది. అమెరికా కర్మికుల ఉద్యోగావకాశాలు, పని పరిస్థితులు, వేతనాల పరిరక్షణ కోసం ఈ నూతన నియమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత లాటరీ విధానాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేసుకుని, విదేశీ ఉద్యోగులను తక్కువ వేతనాల్లో మాత్రమే తీసుకురావడం జరుగుతోందని డీహెచ్‌ఎస్‌ హెచ్చరించింది.

Advertisement