US: ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్ 'ఫాక్స్ న్యూస్'తో మాట్లాడుతూ వెల్లడించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గత 13 రోజులుగా అమెరికా బలగాలు ఇరాన్ లక్ష్యాలపై తీవ్రస్థాయిలో వైమానిక దాడులు నిర్వహించాయి. అయితే వారాంతంలో ఈ సైనిక చర్యలకు పెంటగాన్ తాత్కాలిక విరామం ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్ కూడా పొరుగు దేశాలపై ఎలాంటి దాడులకు పాల్పడినట్లు సమాచారం రాకపోవడం పరిస్థితులు కొంత సానుకూలంగా మారుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
వివరాలు
ట్రంప్ దౌత్య చర్చలకు అవకాశం
ఈ పరిణామాలపై స్పందించిన మైక్ వాల్ట్.. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ దౌత్య చర్చలకు అవకాశం కల్పిస్తూ కొంత సమయం ఇస్తున్నారని చెప్పారు.
చర్చలు విజయవంతం కావడానికి అవసరమైన వాతావరణాన్ని అమెరికా సృష్టిస్తున్నప్పటికీ, వాటి స్వరూపం లేదా తదుపరి కార్యాచరణపై మాత్రం ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
మరోవైపు వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి కూడా ఈ నిర్ణయంపై స్పందించారు.
వివరాలు
సమస్యల పరిష్కారానికి దౌత్యమే తొలి మార్గం: ట్రంప్
సమస్యల పరిష్కారానికి దౌత్యమే తొలి మార్గమని అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు.
అయితే, ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే పరిస్థితులు ఎలా మారుతాయో ఇప్పటికే అమెరికా తన సైనిక చర్యల ద్వారా స్పష్టం చేసిందని హెచ్చరించారు.
అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయా? శాంతి చర్చలు ఎలాంటి ఫలితాన్నిస్తాయా? అనే అంశాలపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.