Loading...
H-4 visa: హెచ్‌-4 వీసాదారులకు ట్రంప్‌ సర్కారు షాక్‌.. వర్క్‌ పర్మిట్‌ రద్దుకు సిద్ధం
హెచ్‌-4 వీసాదారులకు ట్రంప్‌ సర్కారు షాక్‌.. వర్క్‌ పర్మిట్‌ రద్దుకు సిద్ధం

H-4 visa: హెచ్‌-4 వీసాదారులకు ట్రంప్‌ సర్కారు షాక్‌.. వర్క్‌ పర్మిట్‌ రద్దుకు సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్‌-4 వీసాదారులకు ప్రస్తుతం ఉన్న వర్క్‌ పర్మిట్‌ సదుపాయాన్ని తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయ నిపుణుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా హెచ్‌-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే నిపుణులు తమ జీవిత భాగస్వాములను హెచ్‌-4 వీసాపై అక్కడికి తీసుకెళ్తారు. ప్రస్తుతం అర్హత కలిగిన హెచ్‌-4 వీసాదారులు ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ) పొందడం ద్వారా అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది.

వివరాలు 

ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే..

అయితే, కొంతకాలంగా అమల్లో ఉన్న ఈ వర్క్‌ పర్మిట్‌ వెసులుబాటును రద్దు చేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ముఖ్యంగా రెండు ఆదాయాలపై ఆధారపడుతున్న కుటుంబాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది.

వెంటనే హెచ్‌-4 వీసాదారుల వర్క్‌ పర్మిట్లు రద్దు కాలేదు. ప్రతిపాదిత నిబంధనను అధికారికంగా అమలు చేయాలంటే తదుపరి నిబంధనల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.

ADVERTISEMENT