LOADING...
Trump class battleships: అమెరికా నౌకాదళానికి 'గోల్డెన్ ఫ్లీట్'..ట్రంప్ శ్రేణి యుద్ధనౌకలతో బలోపేతం
అమెరికా నౌకాదళానికి 'గోల్డెన్ ఫ్లీట్'..ట్రంప్ శ్రేణి యుద్ధనౌకలతో బలోపేతం

Trump class battleships: అమెరికా నౌకాదళానికి 'గోల్డెన్ ఫ్లీట్'..ట్రంప్ శ్రేణి యుద్ధనౌకలతో బలోపేతం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ట్రంప్ శ్రేణి'కు చెందిన భారీ యుద్ధ నౌకలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫ్లోరిడాలో ఉన్న తన మార్-ఏ-లాగో రిసార్ట్‌లో విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో,రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌లతో కలిసి మాట్లాడిన ట్రంప్,అమెరికా నౌకాదళానికి ప్రత్యేకంగా 'గోల్డెన్ ఫ్లీట్'ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు కొత్త యుద్ధ నౌకల నిర్మాణానికి ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్‌లో నౌకాదళాన్ని మొత్తం 20 నుంచి 25 యుద్ధ నౌకల వరకు విస్తరించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. నిర్మించబోయే ఈ నౌకలు ప్రస్తుతం సేవలో ఉన్న అన్ని యుద్ధనౌకలకంటే ఎంతో భారీగా ఉండటమే కాకుండా,సుమారు 100రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు.

వివరాలు 

 30 వేల నుంచి 40 వేల టన్నుల బరువు ఉండేలా యుద్ధనౌకలు

డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, "అమెరికా నేవీ కోసం గోల్డెన్ ఫ్లీట్‌ను నిర్మించబోతున్నాం. ప్రస్తుతం మా వద్ద ఉన్న కొన్ని నౌకలు నిరుపయోగంగా మారిపోయాయి.అందుకే ఇప్పుడు కొత్త యుద్ధ నౌకల నిర్మాణం అత్యవసరం. ఇవి 100 రెట్లు శక్తివంతమైనవిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధనౌకలుగా ఉంటాయి" అని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధనౌకలు ఒక్కొక్కటి 30 వేల నుంచి 40 వేల టన్నుల వరకు బరువు ఉండేలా రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. తుపాకులు, క్షిపణులతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగించే సామర్థ్యం వీటికి ఉంటుందని చెప్పారు. అలాగే 1994 సంవత్సరం నుంచి అమెరికా కొత్త యుద్ధ నౌకలను నిర్మించలేదని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా నేవీలో ట్రంప్‌ శ్రేణి యుద్ధ నౌకలు

Advertisement