LOADING...
Trump: దాడులకు విరామం.. ప్రపంచ శాంతికి గొప్ప రోజు: 'సీజ్‌ఫైర్‌'పై ట్రంప్‌ పోస్ట్
దాడులకు విరామం.. ప్రపంచ శాంతికి గొప్ప రోజు: 'సీజ్‌ఫైర్‌'పై ట్రంప్‌ పోస్ట్

Trump: దాడులకు విరామం.. ప్రపంచ శాంతికి గొప్ప రోజు: 'సీజ్‌ఫైర్‌'పై ట్రంప్‌ పోస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

గత నలభై రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్నతీవ్రమైన దాడులకు తాత్కాలికంగా విరామం లభించింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదికలో స్పందిస్తూ, ప్రపంచ శాంతికి ఇది ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు. పశ్చిమఆసియాలో ఇది ఒక ముఖ్యమైన మలుపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్‌కు యుద్ధం చాలదన్న భావన కలిగిందని, ప్రపంచ దేశాలూ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయని తెలిపారు. హర్మూజ్ జలసంధిని తిరిగి వినియోగానికి తీసుకురావడంలో అమెరికా సహకారం అందిస్తుందని వెల్లడించారు. సానుకూల చర్యలతో వాణిజ్య రంగంలో పురోగతి సాధించేందుకు ఇది మంచి అవకాశం అని,ఇరాన్ తన దేశ పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించవచ్చని చెప్పారు.

వివరాలు 

ఇరాన్‌ను చైనా ఒప్పించిన అంశంపై స్పందించిన ట్రంప్

ఈ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందని, తమ దేశం మాదిరిగానే ఇరాన్‌కు కూడా మంచి రోజులు వస్తాయని ట్రంప్ వివరించారు. ఇదిలా ఉండగా, అమెరికాతో కాల్పుల విరమణకు అంగీకరించేలా ఇరాన్‌ను చైనా ఒప్పించినట్టు సమాచారం వెలువడుతోంది. ఈ అంశంపై స్పందించిన ట్రంప్, తాను కూడా అలాంటి వార్తలు విన్నానని, అందులో నిజం ఉండొచ్చని అన్నారు. టెహ్రాన్‌ను చర్చలకు ఒప్పించడంలో బీజింగ్ పాత్రపై ప్రశ్నించగా, అవుననే భావిస్తున్నానని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో ఆయన చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement