Page Loader
US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. 198 సీట్లతో ట్రంప్‌ ముందంజ
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. 198 సీట్లతో ట్రంప్‌ ముందంజ

US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. 198 సీట్లతో ట్రంప్‌ ముందంజ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన 20 రాష్ట్రాల్లో విజయం సాధించి, 198 ఎలక్టోరల్‌ ఓట్లు సంపాదించారు. మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మెస్సోరీ, మిస్సిసిప్పి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాలను ట్రంప్‌ కైవసం చేసుకున్నారు. మరోవైపు, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్ ఇల్లినాయిస్‌, న్యూజెర్సీ, మేరీలాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌, కొలరాడో, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా రాష్ట్రాలతో మొత్తం 112 ఎలక్టోరల్‌ ఓట్లు పొందారు.

Details

బ్లూ వాల్‌ను ట్రంప్‌ బ్రేక్‌ చేస్తారా?

ట్రంప్‌ గెలుపొందాలంటే డెమోక్రటిక్‌ పార్టీకి సంప్రదాయ మద్దతు ఉన్న "బ్లూ వాల్‌" స్టేట్స్‌ నుంచి కొన్నింటిని కైవసం చేసుకోవాల్సిందే. సాధారణంగా డెమోక్రటిక్‌ పార్టీకి సపోర్ట్ చేసే ఈ 18 రాష్ట్రాలు, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, మిషిగన్‌, న్యూజెర్సీ, వాషింగ్టన్‌, మసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌, మిన్నెసోటా, విస్కాన్సిన్‌, ఓరెగాన్‌, కనెక్టికట్‌, హవాయ్‌, మైనె, రోడ్‌ ఐలాండ్‌, డెలావేర్‌, వెర్మాంట్‌ రాష్ర్టాలు ఈ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో మొత్తం 238 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ట్రంప్‌ గెలవాలంటే ఈ బ్లూ వాల్‌ రాష్ట్రాల్లో కొన్నింటిని తనవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది.