LOADING...
Greenland: గ్రీన్‌లాండ్‌లో మరో 3 సైనిక స్థావరాలకు అమెరికా ప్లాన్.. డెన్మార్క్‌తో రహస్య చర్చలు!
డెన్మార్క్‌తో రహస్య చర్చలు!

Greenland: గ్రీన్‌లాండ్‌లో మరో 3 సైనిక స్థావరాలకు అమెరికా ప్లాన్.. డెన్మార్క్‌తో రహస్య చర్చలు!

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా గ్రీన్‌లాండ్‌లో తన సైనిక ఉనికిని మరింత పెంచుకునేందుకు కీలక చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి ప్రాంతమైన గ్రీన్‌లాండ్‌లో మూడు కొత్త మిలిటరీ బేస్‌లు ఏర్పాటు చేసే అంశంపై అమెరికా, డెన్మార్క్ మధ్య నెలలుగా చర్చలు కొనసాగుతున్నట్లు BBC వెల్లడించింది. గతంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకురావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ వివాదానికి పరిష్కారం దిశగా ఈ చర్చలు సాగుతున్నట్లు సమాచారం.

వివరాలు 

గ్రీన్‌లాండ్‌లో అమెరికాకు పిటుఫిక్ స్పేస్ బేస్

గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, యూకే మధ్య ఉన్న వ్యూహాత్మక GIUK గ్యాప్ ప్రాంతంలో రష్యా, చైనా సముద్ర కార్యకలాపాలపై నిఘా పెట్టడమే ఈ కొత్త బేస్‌ల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ప్రస్తుతం గ్రీన్‌లాండ్‌లో అమెరికాకు పిటుఫిక్ స్పేస్ బేస్ మాత్రమే ఉంది. కొత్త బేస్‌లలో ఒకటి నార్సార్సువాక్ ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశముందని, అక్కడ ఇప్పటికే పాత అమెరికన్ సైనిక స్థావర మౌలిక సదుపాయాలు ఉండటంతో ఖర్చు తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

Advertisement