US-Israel Strikes on Iran: ఇరాన్‌పై దాడులకు అమెరికా భారీ ఖర్చు.. ఆరు రోజుల్లోనే 11 బిలియన్ డాలర్లు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పోరు కొనసాగుతూనే ఉంది. గత 11 రోజులుగా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు జరిపేందుకు అమెరికా (USA) అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను వినియోగిస్తోంది. ఈ యుద్ధ చర్యల కోసం అగ్రరాజ్యం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైన మొదటి ఆరు రోజుల్లోనే ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి సుమారు 11 బిలియన్ డాలర్లు ఖర్చైనట్లు తెలుస్తోంది. ఇది భారత కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.
వివరాలు
సెనేటర్లకు వెల్లడించిన ఖర్చు వివరాలు
సెనేటర్లతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో అమెరికా రక్షణ అధికారులు యుద్ధ ఖర్చుకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లోనే 11.3బిలియన్ డాలర్లకుపైగా వ్యయం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే అసలు ఖర్చు దీనికంటే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సెనేటర్ క్రిస్ కూన్స్ విలేకరులతో పేర్కొన్నారు. అదనపు నిధుల కోసం ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలు యుద్ధాన్ని కొనసాగించేందుకు ట్రంప్ ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం అదనపు బడ్జెట్‌ను కోరుతూ వైట్‌హౌస్ త్వరలోనే కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపనున్నట్లు కొందరు కాంగ్రెస్ సహాయకులు తెలిపారు. ఈప్రతిపాదనల్లో దాదాపు 50బిలియన్ డాలర్ల వరకు నిధులు కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు
గత నెల 28వ తేదీ నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై తీవ్ర దాడులు కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులతో ఎదురుదాడి చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే అమెరికా 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సామగ్రిని వినియోగించినట్లు అధికారులు అంచనా వేశారు. సైనిక నిల్వలపై కాంగ్రెస్ ఆందోళన అమెరికా రక్షణశాఖ ఇప్పటికే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ యుద్ధం సైనిక నిల్వలను మరింత తగ్గించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆయుధ నిల్వలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.