Loading...
USA: ఇరాన్ రహస్య మార్గాలపై అమెరికా నిఘా.. 20 మందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
ఇరాన్ రహస్య మార్గాలపై అమెరికా నిఘా.. 20 మందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

USA: ఇరాన్ రహస్య మార్గాలపై అమెరికా నిఘా.. 20 మందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు పూర్తైన వెంటనే ట్రంప్ యంత్రాంగం టెహ్రాన్‌పై అడపాదడపా దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా సెంట్రల్ కమాండ్ మరో కీలక విషయాన్ని వెల్లడించింది. సరిహద్దు దేశాల నుంచి ఆయుధాలు, అక్రమ సామాగ్రిని ఇరాన్‌లోకి తరలించేందుకు ఆ దేశ నాయకులు రహస్య భూగర్భ, భూమార్గాలను వినియోగిస్తున్నారని ఆరోపించింది. ఈ మార్గాలను గుర్తించేందుకు 20 మంది సభ్యులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి సైనికాధికారులు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది.

వివరాలు

ఆంక్షలను తప్పించుకునేందుకు రహస్య మార్గాలు?

హర్మూజ్ జలసంధితో పాటు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఓడరేవులు, అంతర్జాతీయ జలమార్గాలపై అమెరికా కొంతకాలంగా ఆంక్షలు అమలు చేస్తోంది.

ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు ఇరాన్ రహస్య మార్గాలను ఏర్పాటు చేసుకుని ఆయుధాలు, ఇతర సామగ్రిని సమకూర్చుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.

నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఈ రహస్య మార్గాలను గుర్తించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

వివరాలు

ఫ్లోరిడా కేంద్రంగా టాస్క్‌ఫోర్స్ కార్యకలాపాలు

ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, ఆయుధ కర్మాగారాలను పునర్నిర్మించడం, సైనిక సామర్థ్యాన్ని తిరిగి పెంపొందించుకోవడం వంటి ఇరాన్ ప్రయత్నాలను అడ్డుకోవడం ఈ ప్రత్యేక విభాగం ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

ఫ్లోరిడా కేంద్రంగా ఇది పనిచేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో సైనికులతో పాటు పౌరులకు కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT