
US: గాజా పౌరుల కోసం అమెరికా వీసాలు నిలిపివేత.. వైద్య సాయం రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా (US) ప్రభుత్వం గాజా ప్రజలకు అన్ని రకాల వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులలో గాయపడిన అనేకమంది గాజా ప్రజలు వైద్య చికిత్స కోసం యూఎస్ వెళ్లుతున్నారని, ట్రంప్ యంత్రాంగానికి ఫిర్యాదులు అందడం వల్ల ఈ నిర్ణయం తీసుకోబడిందని సమాచారం వచ్చింది. తాత్కాలిక వైద్య-మానవతా వీసాలను జారీ చేసే ప్రక్రియపై సమీక్ష జరుపుతున్న సందర్భంలో గాజా ప్రజలకు అన్ని వీసా వర్గాలను నిలిపివేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
Details
ఆగ్రహానికి గురైన పలు స్వచ్చంధ సంస్థలు
విదేశాంగ శాఖ ప్రకారం గాజా నుంచి అమెరికాకు వచ్చే పాలస్తీనియన్లు హమాస్‌కు అనుకూలంగా ఉన్నారని, హమాస్‌కు నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతవారం, తీవ్రంగా గాయపడిన 11 పాలస్తీనియన్ చిన్నారులు వైద్య చికిత్స కోసం 'హీల్ పాలస్తీనా' అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ సహాయంతో యూఎస్‌కి చేరుకున్నారు. కానీ, పెద్ద మొత్తంలో ప్రజలను తరలించడం సక్రమమని ప్రభుత్వం భావించలేదని వివరించారు. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం పలు స్వచ్ఛంద సంస్థల ఆగ్రహానికి కారణమైంది.
Details
ఆహార కొరతతో వేలాది మంది చిన్నారులు మృతి
యూఎస్-ఆధారిత 'పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్' ఈ చర్యను "ప్రమాదకరమైన, అమానవీయమైన నిర్ణయం"గా పేర్కొంది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గత 30 సంవత్సరాలుగా వారు వేలాదిమంది పాలస్తీనా చిన్నారులను వైద్య చికిత్స కోసం అమెరికాకు తరలించారు. ఇజ్రాయెల్ దాడులు, ఆహార కొరత కారణంగా వేలాది పాలస్తీనా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న నేపధ్యంలో, ఇలాంటి ఆంక్షలను విధించడం ఎలా సరిపోతుందని స్వచ్ఛంద సంస్థ ప్రశ్నించింది.