
US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
నిర్దేశిత గడువు మించిపోయినా అమెరికాలోనే కొనసాగుతున్నవారికి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
ఈ అంశంలో నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది.
గడువు మించి దేశంలో ఉండటం వలన బహిష్కరణతో పాటు, భవిష్యత్తులో అమెరికా ప్రవేశంపై శాశ్వత నిషేధం విధించే అవకాశముందని హెచ్చరించింది.
ఈ మేరకు తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో అధికారిక ప్రకటనను షేర్ చేసింది. ఈ హెచ్చరిక పర్యాటక, విద్యార్థి, వర్క్ పర్మిట్ తదితర వీసాలతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఉద్దేశించింది.
వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటే.. చదువు, ఉద్యోగం వంటి అవకాశాలపై ప్రభావం పడతాయని తెలిపింది.
Details
అపరాధ రుసుంతో పాటు జైలు శిక్ష
ఎలాంటి అనుకోని కారణాల వల్ల అమెరికా విడిచి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడితే, వెంటనే యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను సంప్రదించాలని సూచించింది.
30 రోజులకు పైగా వీసా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటే తప్పకుండా ఫెడరల్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి.
అలా కాకపోతే నేరంగా పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షల వరకూ తీసుకెళ్తారు.
చట్టానికి లోబడే స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టాలని గతంలో ప్రకటించింది.
ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక్కరోజు ఎక్కువగా ఉన్నా, రోజుకు రూ.$998 జరిమానా, స్వచ్ఛందంగా అమెరికా విడిచిపెట్టకుండా నిర్లక్ష్యంగా ఉంటే రూ. $1,000 నుంచి రూ. $5,000 వరకు ఫైన్ ఉంటుందన్నారు.