Loading...
EB-5 Green Card: ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులు భారీగా పెంపు.. భారతీయులపై అదనపు భారం
ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులు భారీగా పెంపు.. భారతీయులపై అదనపు భారం

EB-5 Green Card: ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులు భారీగా పెంపు.. భారతీయులపై అదనపు భారం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే వారికి ట్రంప్‌ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి ఆధారిత ఈబీ-5 గ్రీన్‌కార్డు దరఖాస్తుల ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రోగ్రామ్‌లోని కొన్ని దరఖాస్తుల రుసుములను ఏకంగా రెట్టింపు చేసింది. కొత్త ఫీజులను యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) ఖరారు చేసింది. సవరించిన రుసుములు నవంబరు 30 నుంచి అమల్లోకి రానున్నాయి.

వివరాలు 

ఈబీ-5 ప్రోగ్రామ్‌ అంటే..

ఈబీ-5 ఇమిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికా వాణిజ్య రంగంలో పెట్టుబడులు పెట్టి, అక్కడి పౌరులకు ఉద్యోగాలు కల్పించే విదేశీ ఇన్వెస్టర్లు గ్రీన్‌కార్డు పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఈ ప్రోగ్రామ్‌లో వివిధ రకాల దరఖాస్తులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫీజులను తాజాగా సవరించారు.

దరఖాస్తుల పరిశీలన, బ్యాక్‌గ్రౌండ్‌ తనిఖీలు, అర్హతల ధ్రువీకరణ, మోసాలను గుర్తించడం వంటి ప్రక్రియలకు అయ్యే ఖర్చులను భరించేందుకు రుసుములను పెంచినట్లు USCIS తెలిపింది.

కొత్త ఫీజులు ఇలా..

స్టాండ్‌ఎలోన్‌ ఇన్వెస్టర్లు దాఖలు చేసే I-526 ఫామ్‌ దరఖాస్తు ఫీజును 3,675 డాలర్ల నుంచి 7,615 డాలర్లకు పెంచనున్నారు.

వివరాలు 

కొత్త ఫీజులు ఇలా..

గుర్తింపు పొందిన రీజినల్‌ సెంటర్‌ ద్వారా పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు దాఖలు చేసే I-526E దరఖాస్తు రుసుము 3,675 డాలర్ల నుంచి 7,850 డాలర్లకు పెరగనుంది. దీనికి అదనంగా 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు చెల్లించాలి.

శాశ్వత నివాస హోదాపై ఉన్న షరతులను తొలగించాలని కోరుతూ పెట్టుబడిదారులు దాఖలు చేసే I-829 దరఖాస్తు ఫీజును 3,750 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెంచనున్నారు.

అమెరికా వాణిజ్య సంస్థల్లో పెట్టుబడికి ఆమోదం కోరుతూ దాఖలు చేసే I-956F ఫామ్‌ ఫీజు 17,795 డాలర్ల నుంచి ఏకంగా 42,675 డాలర్లకు పెరగనుంది.

ADVERTISEMENT

వివరాలు 

భారతీయులపై ప్రభావం..

అమెరికాలో పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడమే లక్ష్యంగా 1990లో యూఎస్‌ కాంగ్రెస్‌ ఈబీ-5 ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. ఈ పథకం కింద దరఖాస్తుదారులు అమెరికా వ్యాపారాల్లో 1.05 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. లేదా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 8 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

అంతేకాకుండా కనీసం 10 ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలను సృష్టించాలి. ఈ అర్హతలను పూర్తి చేసిన విదేశీ ఇన్వెస్టర్‌తో పాటు వారి జీవిత భాగస్వామి, పిల్లలు కూడా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

భారతీయులపై ప్రభావం..

అయితే ఇతర ఇమిగ్రేషన్‌ కేటగిరీల మాదిరిగానే ఈబీ-5 వీసాల జారీకి కూడా వార్షిక పరిమితి ఉంటుంది. దేశాల వారీగా కూడా వీసాలపై పరిమితులు ఉన్నాయి.

గత దశాబ్ద కాలంగా ఈబీ-5 వీసాల కోసం భారతీయుల నుంచి డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది.

దీంతో గ్రీన్‌కార్డుల కోసం భారతీయ ఇన్వెస్టర్లు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇప్పుడు దరఖాస్తు రుసుములను పెంచడంతో ఇప్పటికే ఉన్న పెట్టుబడి, ఇమిగ్రేషన్‌ ఖర్చులకు అదనంగా మరింత ఆర్థిక భారం పడనుంది.

ADVERTISEMENT