Valero refinery explosion: టెక్సాస్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
టెక్సాస్‌లోని ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాలెరో సంస్థకు చెందిన పోర్ట్ ఆర్థర్ రిఫైనరీలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత వరుసగా తీవ్ర మంటలు చెలరేగి ఆ ప్రాంతంలో కలకలం రేపాయి. పోర్ట్ ఆర్థర్ ప్రాంతంలో ఉన్న రిఫైనరీ సమీప నివాసితులు భారీ శబ్దంతో తమ ఇళ్లు కదిలినట్లు భావించామని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తీరుపై తొలుత అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వాలెరో రిఫైనరీలో అగ్నిప్రమాదం
Following reports of an explosion, a massive fire can be seen at the Valero oil refinery in Port Arthur, Texas. pic.twitter.com/I3UYBTS41A
— OSINTdefender (@sentdefender) March 24, 2026