Pope Francis: ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఫొటో విడుదల చేసిన వాటికన్
ఈ వార్తాకథనం ఏంటి
వాటికన్ 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్‌కు సంబంధించిన తాజా ఫోటోను విడుదల చేసింది.
ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు తీసిన ఈ చిత్రాన్ని ఆదివారం విడుదల చేసింది.
తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా, ఫిబ్రవరి 14న రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో ఆయన చేరారు.
అప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించని పోప్ ఫ్రాన్సిస్ తాజా ఫోటో ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.
వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం, న్యుమోనియాకు ప్రత్యేక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వాటికన్ తెలిపింది.
ఆస్పత్రిలో పోప్ కోసం ప్రత్యేక ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు.
పోప్ బలిపీఠం ఎదుట కూర్చున్న దృశ్యాన్ని వెనుక నుంచి చిత్రీకరించారు.
వివరాలు
కనిపించని వైద్య పరికరాలు
అయితే ఈ ఫోటోలో ఆయన ముఖం కనిపించలేదు. కుడి చేయిని ఒడిలో ఉంచుకున్నారు.
ఆసక్తికరంగా, ట్రీట్‌మెంట్ కోసం ఎలాంటి వైద్య పరికరాలు కనిపించలేదు. అంటే ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ చికిత్స అవసరం లేదని తెలుస్తోంది.
శనివారం విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం, పోప్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు.
శ్వాస సాధారణంగా తీసుకుంటున్నారని, కానీ రాత్రి సమయంలో మాత్రం యాంత్రిక వెంటిలేషన్ అందిస్తున్నారని వాటికన్ పేర్కొంది.
అయితే ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే విషయం ఇంకా స్పష్టత లేదు.
గురువారం, ఆస్పత్రిలోనే పోప్‌గా ఎన్నికైన 12వ వార్షికోత్సవాన్ని ఫ్రాన్సిస్ జరుపుకున్నారు.
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, పోప్‌గా ఆయన తన బాధ్యతలను కొనసాగించనున్నారు.