LOADING...
Venezuela earthquake: వెనిజులా భూకంపాల భయానక దృశ్యాలు.. డ్రోన్ వీడియో వైరల్
వెనిజులా భూకంపాల భయానక దృశ్యాలు.. డ్రోన్ వీడియో వైరల్

Venezuela earthquake: వెనిజులా భూకంపాల భయానక దృశ్యాలు.. డ్రోన్ వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల విధ్వంసాన్ని చూపించే డ్రోన్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో భవనాలు కూలిపోవడం,కాలనీలు నేలమట్టం కావడం, భారీ స్థాయిలో జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 24న నిమిషం వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు కనీసం 1,450 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆదివారం (జూన్ 28) తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ మాట్లాడుతూ, సహాయక చర్యలు ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు.

వివరాలు 

మరో వారం రోజుల పాటు పాఠశాలలు మూసివేత 

భూకంపం తర్వాత కూడా వరుసగా ప్రకంపనలు నమోదవుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా అత్యవసర సిబ్బంది సేవలందిస్తుండగా, వేలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారని, అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని వెల్లడించారు. "ఈరోజు కూడా కొంతమందిని సజీవంగా రక్షించాం" అని డెల్సీ రోడ్రిగెస్ స్పష్టం చేశారు. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోకపోవడంతో దేశంలోని అన్ని పాఠశాలలను మరో వారం రోజుల పాటు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం,లా గువైరా ప్రాంతంలో సుమారు 75 శాతం మేర విద్యుత్ సరఫరా పునరుద్ధరించగా,రాష్ట్రంలోని 68 శాతం ప్రాంతాలకు తాగునీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దాదాపు 90 శాతం రహదారులు రాకపోకలకు అనుకూలంగా మారినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

మృతుల సంఖ్య పెరుగుతోంది

జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంపాల కారణంగా ఇప్పటివరకు 1,450 మంది మరణించారు. మరో 3,150 మంది గాయపడగా, 12,721 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 774 భవనాలు దెబ్బతినగా, వాటిలో 189 భవనాలు పూర్తిగా కూలిపోయాయని తెలిపారు. " ఇవి అత్యంత కీలకమైన గంటలు. ప్రతి క్షణం ఎంతో విలువైనది" అని జార్జ్ రోడ్రిగెస్ పేర్కొన్నారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, మృతదేహాల సంఖ్య పెరుగుతుండటంతో మార్చురీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. మృతుల గుర్తింపును వేగవంతం చేసేందుకు అదనపు ఫోరెన్సిక్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. సహాయక, పునరావాస చర్యలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెనిజులాను కుదిపేసిన జంట భూకంపాలు.. 1,450 మంది మృతి

Advertisement