Video: ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఊడిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ చక్రం.. పలువురికి గాయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత ఈ విమానాల సురక్షితతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, తాజాగా జర్మనీలో చోటుచేసుకున్న ఘటన ఆ ఆందోళనలను మరింత పెంచింది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానానికి ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరేందుకు సిద్ధంగా గేట్ వద్ద నిలిపి ఉంచిన LH450 విమానం ముందరి ల్యాండింగ్ గేర్ (నోస్ గేర్) అకస్మాత్తుగా కుప్పకూలడంతో విమానం ముందు భాగం నేలపై పడిపోయింది.
వివరాలు
వాణిజ్య సేవల్లోకి వచ్చిన కొత్త మోడల్
ఈ ఘటన సమయంలో విమానంలో సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఇంకా విమానంలోకి ఎక్కకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు గల కారణాలపై లుఫ్తాన్సా సంస్థతో పాటు సంబంధిత విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బోయింగ్ సంస్థ కూడా విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం 2026 జనవరిలోనే వాణిజ్య సేవల్లోకి వచ్చిన కొత్త మోడల్ కావడం విశేషం. దీంతో డ్రీమ్‌లైనర్ విమానాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన
A nearly five-month-old Lufthansa Boeing 787-9 Dreamliner at Frankfurt, preparing for a flight to Los Angeles, experienced a nose landing gear collapse at the gate. pic.twitter.com/72b6J4HyIr
— Aviation (@xAviation) June 4, 2026