Australia: విమానం వెనక భాగంలో చిక్కుకొన్న స్కైడైవర్ పారాచూట్: దృశ్యాలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్కైడైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఓ వ్యక్తి దూకే సమయంలో అతని పారాచూట్ విమానం వెనుక భాగానికి చిక్కుకుని పోవడంతో అతను కొంతసేపు గాల్లోనే వేలాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానిక అధికారులు విడుదల చేయగా, అవి సోషల్‌మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఈ ఏడాది సెప్టెంబర్‌లో దక్షిణ కెయిర్న్స్ ప్రాంతంలో జరిగిందని, అయితే ఇది తాజాగా వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తూ, ఆ స్కైడైవర్‌కు ఎలాంటి గాయం కాలేదని, పూర్తిగా సురక్షితంగా బయటపడ్డాడని అధికారికంగా ధృవీకరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
గాల్లో వేలాడుతూ తీవ్ర భయాందోళనకు స్కైడైవర్..
సుమారు 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ కోసం పలువురు వ్యక్తులు విమానం నుంచి పారాచూట్‌లతో దూకుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వారిలో ఒకరి పారాచూట్ దూకే సమయంలో విమానానికి అనుకోకుండా చిక్కుకుంది. దీంతో అతను గాల్లో వేలాడుతూ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. అయితే తన వద్ద ఉన్న అదనపు పారాచూట్‌ను ఉపయోగించి అతను చివరికి సురక్షితంగా నేలపైకి దిగగలిగాడు. అనంతరం పైలట్ కూడా విమానాన్ని సజావుగా ల్యాండ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విమానం వెనక భాగంలో చిక్కుకొన్న స్కైడైవర్ పారాచూట్
🇦🇺 Skydiver's parachute got caught on the tail of a plane, leaving him dangling 15,000 feet in the air over North Queensland, Australia pic.twitter.com/9mxPuftHMq
— Wealth Path Academy (@WPAcademy12) December 11, 2025