
Viral video: విలేకర్లతో మాట్లాడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
స్వీడన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్ లాన్ అనుకోకుండా కుప్పకూలిపోయారు. మంత్రిగా నియమితులైన కొంతసేపటికే ఇలాంటి సంఘటన జరగడం ప్రజలను ఆశ్చర్యానికి లోను చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలేం జరిగిందంటే.. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఎలిసాబెట్ లాన్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఉండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడికి ఉన్నవారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గిపోయిన కారణంగా ఇలా జరిగిందని ఒక అధికారి తెలిపారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్వీడన్ ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Swedish Health Minister Elisabet Lann has collapsed during a press conference. No known condition as of yet. pic.twitter.com/SNIVANYlCX
— Trending Now ON X (@TrendingNowVidz) September 9, 2025