UK : 16 ఏళ్ల బాలికపై విచిత్రమైన గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు
యూకేలో ఓ బాలికపై ఓ విచిత్రమైన గ్యాంగ్ రేప్ జరిగింది. 16 ఏళ్ల బాలికపై పర్చువల్‌గా ఆన్‌లైన్ 'మోటావర్స్'లో సామూహిక ఆత్యాచారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పర్చువల్ రియాలిటీ గేమ్‌లో `16 ఏళ్ల బాలిక డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులతో సామూహిక అత్యాచారానికి గురైంది. దీనిపై బాలిక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నట్లు ఓ వార్త సంస్థ నివేదించింది. ఆ బాలిక ఆన్‌లైన్ గేమ్‌లో ఉండగా కొంతమంది పురుషులు ఆమె క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.
పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి పర్చువల్ లైంగిక కేసు
అయితే బాలికపై ఎలాంటి గాయాలు కాకున్నా కూడా ఆమె తాను అత్యాచారానికి గురై మానసిక బాధను అనుభవిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి పర్చువల్ లైంగిక నేరం ఇదేనని భావిస్తున్నారు. శారీరకంగా అత్యాచారం జరగకపోయినా, కానీ మానసికంగా ఆమె బాధను అనుభవిస్తోందని యూకే పోలీస్ అధికారి చెప్పారు. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్లిందని యూకే హోం కార్యదర్శి జెమ్స్ క్లీనరి పేర్కొన్నాడు. ఇది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు రావడంతో మెటా ప్రతినిధి ఒకరు స్పందించారు. తమ ఫ్లాట్ ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని పేర్కొన్నాడు.