Page Loader
Einstein Brain: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐన్ స్టీన్ బ్రెయిన్ పేరుతో వర్చువల్ ప్రోడక్ట్!
ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐన్ స్టీన్ బ్రెయిన్ పేరుతో పర్చువల్ ప్రోడక్ట్!

Einstein Brain: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐన్ స్టీన్ బ్రెయిన్ పేరుతో వర్చువల్ ప్రోడక్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2023
06:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌లో ఐన్‌స్టీన్ బ్రెయిన్.. దీన్ని కొంటే తెలివైన వారు అవుతారని చైనా వెబ్‌సైట్ త‌బావు అనే పేరుతో వ‌ర్చువ‌ల్ ప్రోడ‌క్ట్‌ను అమ్మకానికి పెట్టారు. ఈ ప్రొడక్టు‌ కొంటే అత్యంత తెలివైనా వారుగా మారుతారని ఆ కంపెనీ రాసుకొచ్చింది. దీన్ని కొనుగోలు చేసిన వారు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి బ్రెయిన్‌ను సొంతం చేసుకోవచ్చని చైనీస్ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ తెగ ప్రచారం చేస్తోంది. దీని ఒక్క యూనిట్ ధర 0.1 నుంచి ఒక యువాన్ వరకు ఉంది. అంటే భారత కరెన్సీలో రూ. 1 నుంచి రూ.12 మాత్రమే. ఇప్పటికే ఈ ప్రొడెక్టును 20వేల మంది కొనుగోలు చేయడం గమనార్హం. అర్బర్ట్ ఐన్ స్టీన్ ఇమేజ్‌తో ఈ ప్రోడక్ట్‌ను విక్రయిస్తున్నారు.

Details

వర్చువల్ ప్రోడక్ట్ వృధా అంటూ కామెంట్లు

తమ ప్రొడక్ట్ భౌతికంగా కనిపించదని, దీని కోసం డబ్బులు చెల్లించిన తర్వాత, స్మార్ట్ అవడం ఎదురు చూడాల్సి ఉంటుందని, సాధారణంగా ఒక రాత్రి తర్వాత నుంచే మీ తలలో ఐన్ స్టీన్ బ్రెయిన్ వృద్ధి చెందడాన్ని గుర్తిస్తారని ఆ సంస్థ రాసుకొచ్చింది. ఇప్పటికే ఈ ప్రొడక్ట్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూజర్లు దీనిపై ఏకంగా రివ్యూలను కూడా ఇచ్చేస్తున్నారు. ఈ ప్రోడ‌క్ట్ వాడిన త‌ర్వాత తాను ఎగ్జామ్‌లో అన్ని ప్రాబ్ల‌మ్స్‌ను సాల్వ్ చేశాన‌ని ఓ యూజ‌ర్ చెప్పగా.. మరికొందరు ఈ ప్రోడ‌క్ట్ వృధా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.