LOADING...
India Issues Advisory: ఎమర్జెన్సీ అలర్ట్స్‌ గమనించండి : ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ కీలక సూచన!
ఎమర్జెన్సీ అలర్ట్స్‌ గమనించండి : ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ కీలక సూచన!

India Issues Advisory: ఎమర్జెన్సీ అలర్ట్స్‌ గమనించండి : ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ కీలక సూచన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ల్ దాడుల కారణంగా ఇరాన్‌ దద్దరిల్లిన పరిస్థితిలో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఇరాన్‌ ప్రతీకార దాడులు చేపడతానని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (High Alert)ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Details

రాయబార కార్యాలయం సూచనల ప్రకారం, ఇజ్రాయెల్‌లో భారత పౌరులు

స్థానిక భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి అత్యవసరమయ్యే వరకు ప్రయాణాలు వదులుకోవాలి సురక్షిత ప్రాంతాల్లోనే ఆశ్రయం పొందాలి స్థానిక వార్తలు, ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, టెల్‌ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు: ఫోన్: +972-54-7520711 ఇమెయిల్: [cons1.telaviv@mea.gov.in](mailto:cons1.telaviv@mea.gov.in) రాయబార కార్యాలయం, పరిస్థితులు మారిన ప్రతి దశలో అప్‌డేట్లు అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement