Israel-Hamas: 'మేము బందీగా ఉన్నాం.. కాపాడండి'.. హమాస్ చెరలో ఇజ్రాయెల్ నిఘా సైనికురాలు విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు కొనసాగుతుండగా, హమాస్ తమ చెరలో ఉన్న బందీల వీడియోలను విడుదల చేస్తోంది.
ఈ నేపథ్యంలో హమాస్ తాజాగా ఇజ్రాయెల్ నిఘా సైనికురాలైన 19 ఏళ్ల లిరి అల్బాగ్ వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోని హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు విడుదల చేసింది.
వీడియోలో లిరి 450 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నట్లు తెలిపింది. ఆమె టెల్ అవీవ్ నాయకులకు ఆమెను రక్షించాలని విజ్ఞప్తి చేసింది.
లిరి అల్బాగ్ ఓ నిఘా సైనికురాలిగా పనిచేస్తున్నట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. గాజా సరిహద్దు సమీపంలోని నహాల్ ఓజ్ సైనిక స్థావరంలో జరిగిన దాడిలో 15 మంది మరణించారు.
Details
హమాస్ చెరలో 97 మంది
ఇక లిరితో పాటు మరో ఆరుగురిని బందీలుగా తీసుకెళ్లారు. వీడియోపై బాధితురాలి కుటుంబ సభ్యులు స్పందిస్తూ, "ఆ దృశ్యం తమల్ని కలవరపరుస్తోందని, లిరి మానసిక వేదనతో ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు బాధితులు బందీలను వెంటనే విడిపించాలని విజ్ఞప్తి చేశారు.
2023లో హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తరువాత 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని బందీగా తీసుకెళ్లారు.
ప్రస్తుతం 43,000 మందికి పైగా గాజాలో ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో కొంతమంది బందీలను విడుదల చేసినప్పటికీ, ఇంకా 97 మంది హమాస్ చెరలో ఉన్నారు.