LOADING...
India-US: భారత్‌కు నేను పెద్ద అభిమానిని.. ద్వైపాక్షిక బంధంపై అమెరికా ఇంధన శాఖ మంత్రి వ్యాఖ్యలు
ద్వైపాక్షిక బంధంపై అమెరికా ఇంధన శాఖ మంత్రి వ్యాఖ్యలు

India-US: భారత్‌కు నేను పెద్ద అభిమానిని.. ద్వైపాక్షిక బంధంపై అమెరికా ఇంధన శాఖ మంత్రి వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

తమ అద్భుత మిత్రదేశమైన భారతదేశంతో ఇంధన రంగంలో సహకారాన్నిమరింత విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు అగ్రరాజ్య ఇంధనశాఖ మంత్రి క్రిస్‌ రైట్‌ తెలిపారు. భారత్-అమెరికాల మధ్య ఇంధన,వాణిజ్య రంగాల్లో పరస్పర సంబంధాలను బలపరచడం గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో తాను చర్చించినట్లు ఆయన తెలిపారు. న్యూయార్క్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈవ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోలు అంశాన్ని కూడా ప్రస్తావించారు. క్రిస్‌ రైట్‌ మాట్లాడుతూ.. "నేను భారతదేశానికి పెద్ద అభిమాని.ఆ దేశాన్ని మేము ఎంతో ఇష్టపడతాం. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌తో ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవాలని మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.అయితే,ప్రస్తుతం భారత్‌ రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా ఒక క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుపోయింది"అని అన్నారు.

వివరాలు 

న్యూదిల్లీతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం

"భారతదేశానికి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. అయినప్పటికీ, తక్కువ ధరలకు అందుబాటులో ఉండటంతో ఆ దేశం ఆ కొనుగోళ్లు కొనసాగిస్తోంది. కానీ, చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం రష్యా యుద్ధానికి ఉపయోగపడుతోంది. అందువల్ల, అలాంటి దేశంతో వ్యాపారం నిలిపివేస్తే భారత్‌కే మంచిదవుతుంది. న్యూదిల్లీపై అమెరికా ఎటువంటి ఆంక్షలు విధించాలని కోరుకోవడం లేదు. మా ప్రధాన ఉద్దేశం యుద్ధాన్ని ముగించడం మాత్రమే. భారత్‌ తమ ఇంధన దిగుమతుల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే న్యూదిల్లీతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలపరచాలని కోరుకుంటున్నాం" అని స్పష్టం చేశారు.