Greenland:'గ్రీన్‌లాండ్‌ను కాపాడతాం'.. ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
వనరుల పరంగా అత్యంత కీలకమైన గ్రీన్‌లాండ్‌పై అంతర్జాతీయ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ దీవిని స్వాధీనం చేసుకోవాలనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్‌కు చెందిన ఓ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను ట్రంప్ నుంచి రక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆ అధికారి మాట్లాడుతూ గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలని ట్రంప్ మొదట ఐరోపా దేశాలను బెదిరించారు. తరువాత వారిని బతిమాలుకున్నారు. ఇప్పుడు అయితే దానిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఐరోపాకు నా సందేశం ఒకటే.. మీరు మీ గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేకపోతే, మా సహాయం కోరండి.
Details
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం
మేము ఆయన నుంచి దాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే గ్రీన్‌లాండ్‌కు ఎలా రక్షణ కల్పిస్తారన్న దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో నికోలస్ మదురోను నిర్బంధించిన తర్వాత గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి. దీనిపై చర్చలు జరపాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే గ్రీన్‌లాండ్‌పై అధికారం కలిగిన డెన్మార్క్ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. గ్రీన్‌లాండ్ విషయంలో తనకు మద్దతు ఇవ్వని యూరోపియన్ యూనియన్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని ట్రంప్ తొలుత హెచ్చరించినప్పటికీ, తర్వాత వెనక్కి తగ్గారు. ఇరాన్ అధికారి తాజా వ్యాఖ్యలతో గ్రీన్‌లాండ్ అంశం మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.