Canada: అమెరికా ఐరన్ డోమ్ ప్రాజెక్టులో మేమూ భాగస్వాములవుతాం.. ప్రకటించిన కెనడా రక్షణ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ తయారీలో భాగస్వామ్యం కోసం కెనడా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి బిల్ బ్లేయర్ వెల్లడించారు.
వాషింగ్టన్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
''అమెరికాతో మేం అత్యంత కీలక భాగస్వాములం. ఉత్తర అమెరికా రక్షణకు సంబంధించి నాటో, నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఈ వ్యవస్థలో మేము భాగస్వాములవ్వడానికి సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పారు.
ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికా-కెనడా సంబంధాలు తీవ్రంగా మారాయి.
ఇదే సమయంలో మిలిటరీ సహకారం అనే అంశం తెరపైకి రావడం గమనార్హం.
వివరాలు
ప్రస్తుతం ఐరన్ డోమ్ వ్యవస్థను ఇజ్రాయెల్ ఉపయోగిస్తుంది
ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ వ్యవస్థ బాలిస్టిక్, క్రూజ్, హైపర్‌సోనిక్ క్షిపణులను ఎదుర్కొనేలా రూపొందించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
ఇజ్రాయెల్ ప్రస్తుతం ఐరన్ డోమ్ వ్యవస్థను ఉపయోగిస్తోంది.
గాజా యుద్ధం సమయంలో ఈ వ్యవస్థ వేలాది రాకెట్లను నేలకూల్చింది.
2011లో మొదటిసారి దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇది 90%కు పైగా ఖచ్చితత్వంతో గగనతలంలో లక్ష్యాలను కూల్చివేస్తుందనే పేరు ఉంది.
వివరాలు
యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చివేయడంలో ఐరన్ డోమ్ కీలక భూమిక
ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అనేక దశల్లో పని చేస్తుంది.
ముఖ్యంగా యారో-2, యారో-3 వ్యవస్థలు బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనడానికి వినియోగిస్తారు.
100-200 కిలోమీటర్ల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు.
అంతేకాకుండా, యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చివేయడంలో ఐరన్ డోమ్ కీలక భూమిక పోషిస్తోంది.