Vladimir Putin: టోవోరాగ్,తాజా పళ్లు,చేపలు .. : పుతిన్ ఇష్టపడే ఆహారం ఇదే..!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత్ పర్యటనకు విచ్చేయనున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్ అడుగు పెట్టనున్న ఆయన, ఈ పర్యటనలో పలు ఒప్పందాలు సంతకం చేయనున్నారు. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీతో ప్రైవేట్ డిన్నర్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో పుతిన్ ఏ విధమైన ఆహారాన్ని ఇష్టపడతారో, ఆయన డైలీ ఫుడ్ రొటీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పలు ఆంగ్ల మీడియా కథనాలు కూడా వచ్చాయి.
వివరాలు
ఈ వంటకాలకు ప్రాధాన్యం
పుతిన్ సాధారణంగా తేలికగా జీర్ణమయ్యే, సంప్రదాయ రష్యన్ వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కోసం రష్యాలో ప్రసిద్ధి చెందిన టోవోరాగ్ (కాటన్ చీజ్ తేనెతో కలిపి చేసే వంటకం) తీసుకుంటారు. దానికి తోడుగా గుడ్లు, తాజా పళ్లతో చేసిన జ్యూస్ కూడా ఉంటాయి. ప్రొటీన్ కోసం చేపలను ఎక్కువగా తినడం ఆయన అలవాటు. స్టర్‌జియన్ చేప,గొర్రెపిల్ల మాంసం ఆయనకు చాలా ఇష్టం. చక్కెరతో చేసిన పదార్థాలు, డెజర్ట్స్‌లలో ఆసక్తి చూపరు. బదులుగా టమాటాలు, దోసకాయల వంటి కూరగాయల సలాడ్లు ఇష్టపడతారు. అరుదుగా మాత్రమే ఐస్‌క్రీమ్, పేస్ట్రీలు తింటారు. అధికారిక విందులలో ఎక్కువగా చేపలతో తయారైన సూప్‌లు, మాంసాహార వంటకాలకు ప్రాధాన్యం ఇస్తారు.
వివరాలు
2014లో కశ్మీరీ సంప్రదాయ వంటకాలు
గత భారత పర్యటనల్లో కూడా ఆయనకు ప్రత్యేక విందులు ఏర్పాటు చేయబడ్డాయి. 2014లో వచ్చినప్పుడు,రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన కోసం కశ్మీరీ సంప్రదాయ వంటకాలు వడ్డించారు. ఇందులో కుంకుమ పువ్వుతో చేసిన పానీయం,పాలకూర హాక్ కా సాగ్,గులాటీ కబాబ్,ముర్గ్ ధనివాల్ కుర్మా,బాదాం షోర్బా, గులాబ్ ఖీర్, చీజ్ కేక్ వంటివి ఉండాయి. 2018లోని పర్యటనలో కూడా ఆయన కోసం ప్రత్యేకంగా వెజిటేరియన్,నాన్-వెజ్ వంటకాలు తయారుచేశారు. ఇందులో సాల్మన్ ఫిల్లెట్, మొఘలాయ్ స్టైల్ గొర్రె మాంసం, వివిధ రకాల చికెన్, వాటర్‌మిలన్ క్రీమ్ సూప్, మొలకెత్తిన గింజలతో చేసిన పఫ్, కబాబ్, రికోటా సిల్వర్ పెరల్స్ వంటి డిషెస్ ఉన్నాయి. అయితే, ఆయన వాటిని తిన్నారా అన్న విషయంలో స్పష్టత లేదు.
వివరాలు
పుతిన్ చుట్టూ కఠినమైన భద్రతా ప్రోటోకాల్
విదేశీ పర్యటనల సమయంలో పుతిన్ చుట్టూ అత్యంత కఠినమైన భద్రతా ప్రోటోకాల్ ఉంటుంది. పుతిన్ తీసుకునే ఆహారంలో విషపదార్థాలేమైనా కలిశాయో గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది విదేశాల్లో హోటల్ సిబ్బందిని ఉపయోగించరు; ఆయన కోసం రష్యా నుంచి ప్రత్యేక చెఫ్‌లు, హౌస్‌కీపింగ్ సిబ్బంది వస్తారు.