White House: వైట్‌హౌస్‌లో 'సారే జహాసె అచ్ఛా..' రుచికరమైన సమోసాలు, పానీపూరీ విందు .. ఎందుకో తెలుసా?
భారత్ మెల్లగా అమెరికాపై ప్రభావం చూపుతోంది, ఇదంతా ఎన్నారైల వల్లే జరుగుతోంది. ఈసారి కూడా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఆసియా కమ్యూనిటీని, ముఖ్యంగా భారతీయులను సంతోషపెట్టడానికి అయన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. USలో వైట్ హౌస్ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో, సారే జహాన్ సే అచ్ఛా హిందూస్థాన్ హమారా... అనే గీతాన్ని ఆలపించడం విశేషం. వచ్చిన అతిథులకు భారత్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ వడ్డించడం గమనార్హం.
అమెరికా వైట్‌హౌస్‌లో వేడుకలు
సోమవారం రోజ్ గార్డెన్ రిసెప్షన్‌ను ఆసియన్ అమెరికన్, స్థానిక హవాయి, పసిఫిక్ ద్వీపవాసుల (AANHPI) హెరిటేజ్ మాసాన్ని జరుపుకోవడానికి బైడెన్ హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు,పానీపూరీ ని వడ్డించారు. భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న యూఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్‌మూర్తి ఉత్సాహంగా డ్రమ్స్ వాయించడంతో అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు.