White House: వెనుజువెలా చమురును క్వారంటైన్ చేయండి: సైన్యానికి శ్వేతసౌధం ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
వెనిజులా చమురును ప్రపంచ మార్కెట్‌కు చేరకుండా అడ్డుకునేలా వచ్చే కనీసం రెండు నెలల పాటు అమెరికా సైనిక బలగాలు దాదాపుగా అదే పనిపై దృష్టి పెట్టాలని వైట్ హౌస్ ఆదేశాలు ఇచ్చినట్లు ఒక అమెరికా అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. ప్రస్తుతం కరాకాస్‌పై సైనిక చర్యలకన్నా ఆర్థిక మార్గాల్లో ఒత్తిడి పెంచడానికే వాషింగ్టన్ ఆసక్తి చూపుతోందని ఆయన వెల్లడించారు. సైనిక ఎంపికలు ఇంకా ఉన్నప్పటికీ, ముందుగా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ ఆర్థిక ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే జరుగుతోందని ఆ అధికారి తెలిపారు.
వివరాలు
మదురో అధికారాన్ని వదిలితే మంచిది: ట్రంప్
ఈ విషయమై పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి మాట్లాడుతూ.. వెనిజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా స్పష్టత ఇవ్వకపోయినా,దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని అధ్యక్షుడు నికోలస్ మదురోపై అంతర్గతంగా ఒత్తిడి తెస్తున్నట్టు రాయిటర్స్ ఇప్పటికే కథనాలు ఇచ్చింది. సోమవారం ట్రంప్ కూడా మదురో అధికారాన్ని వదిలితే మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యల వల్ల మదురోపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని, అమెరికా కోరినట్లుగా గణనీయమైన రాయితీలు ఇవ్వకపోతే జనవరి చివరినాటికి వెనిజువెలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అమెరికా అంచనా వేస్తోందని ఆ అధికారి తెలిపారు.
వివరాలు
మూడో నౌక స్వాధీనం దిశగా అమెరికా ప్రయత్నాలు
వెనిజువెలా నుంచి మత్తు పదార్థాలు అమెరికాకు వస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా దక్షిణ అమెరికా నుంచి వస్తున్నాయని చెబుతున్న పడవలపై అమెరికా దాడులు చేస్తోంది. అయితే ఈ దాడులను అనేక దేశాలు న్యాయ ప్రక్రియ లేకుండా జరిగే హత్యలుగా ఖండించాయి. భూభాగంలో ఉన్న డ్రగ్స్ మౌలిక వసతులపై దాడులు చేస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. అలాగే కరాకాస్‌ను లక్ష్యంగా చేసుకుని సీఐఏ గోప్య కార్యకలాపాలకు కూడా ఆయన అనుమతి ఇచ్చారు. ఈ నెలలో ఇప్పటివరకు కరీబియన్ సముద్రంలో వెనిజువెలా ముడిచమురుతో నిండిన రెండు ట్యాంకర్లను అమెరికా కోస్ట్ గార్డ్ అడ్డుకుంది.
వివరాలు
మూడో నౌక స్వాధీనం దిశగా అమెరికా ప్రయత్నాలు
ఖాళీగా ఉన్న 'బెల్లా-1' అనే ఆంక్షల జాబితాలోని మూడో నౌకను స్వాధీనం చేసుకునేందుకు అదనపు బలగాల కోసం కోస్ట్ గార్డ్ ఎదురు చూస్తోందని రాయిటర్స్ వెల్లడించిన నేపథ్యంలోనే వైట్ హౌస్ అధికారి వ్యాఖ్యలు వచ్చాయి. వెనిజువెలా ఐక్యరాజ్య సమితి రాయబారి సాముయేల్ మోంకాడా స్పందిస్తూ, "ముప్పు వెనిజువెలా కాదు. అసలు ముప్పు అమెరికా ప్రభుత్వం" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
కరీబియన్‌లో భారీ అమెరికా సైనిక మోహరింపు
వెనిజువెలా చమురును అడ్డుకోవడంపై సైన్యం 'దాదాపుగా పూర్తిగా' దృష్టి పెట్టడం అంటే ఏమిటో వైట్ హౌస్ అధికారి స్పష్టంగా చెప్పలేదు. అమెరికా సైనిక బలగాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండగా, చాలా మిషన్లు సముద్ర మార్గాల అడ్డుకట్టకు సంబంధించినవికావని సమాచారం. కరీబియన్ ప్రాంతంలో అమెరికా 15 వేల మందికి పైగా సైనికులతో భారీ స్థాయిలో మోహరింపును చేపట్టింది. ఇందులో ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, మరో 11 యుద్ధ నౌకలు, డజను కంటే ఎక్కువ ఎఫ్-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆంక్షలను అమలు చేయడంలో కొన్ని సైనిక వనరులే నిజంగా పనికివస్తాయని, యుద్ధ విమానాల్లాంటి వాటితో పెద్దగా ఉపయోగం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
కరీబియన్‌లో భారీ అమెరికా సైనిక మోహరింపు
మదురో ప్రభుత్వానికి వనరులు అందకుండా చేయడానికి గరిష్ట స్థాయిలో ఆంక్షలు విధించి అమలు చేస్తామని అమెరికా మంగళవారం ఐక్యరాజ్యసమితికి తెలిపింది. ఈ నెల మొదట్లో వెనిజువెలాకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని ఆంక్షలపాలైన చమురు ట్యాంకర్లపై 'బ్లాకేడ్' విధించాలని ట్రంప్ ఆదేశించారు. అయితే వైట్ హౌస్ 'బ్లాకేడ్' అనే పదం బదులు 'క్వారంటైన్' అన్న మాట వాడటం,1962 క్యూబా క్షిపణి సంక్షోభ సమయంలో యుద్ధ పదజాలం వాడకూడదని జాన్ ఎఫ్. కెన్నెడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తోంది.
వివరాలు
బ్లాకేడ్ అనేది యుద్ధ పదం
అప్పటి రక్షణ మంత్రి రాబర్ట్ మెక్‌నమారా 2002లో మాట్లాడుతూ, "బ్లాకేడ్ అనేది యుద్ధ పదం. అందుకే మేము క్వారంటైన్ అన్నాం" అని చెప్పారు. అయితే ఐక్యరాజ్యసమితి నిపుణులు ఈ చర్యలను ఖండిస్తూ, ఇటువంటి బ్లాకేడ్‌ను 'అక్రమ సాయుధ దాడి'గా అంతర్జాతీయ చట్టాలు గుర్తిస్తాయని స్పష్టం చేశారు.