LOADING...
India- USA: ఇండియన్స్ కు అమెరికా అంటే ఎందుకంత మక్కువ.. ప్రధాన కారణాలివే!
ఇండియన్స్ కు అమెరికా అంటే ఎందుకంత మక్కువ.. ప్రధాన కారణాలివే!

India- USA: ఇండియన్స్ కు అమెరికా అంటే ఎందుకంత మక్కువ.. ప్రధాన కారణాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ టెక్కీలలో భయాన్ని సృష్టించింది. అమెరికాలో పని చేసే ప్రొఫెషనల్‌ల కోసం ఉన్న H-1B వీసా ఫీజును $100,000 (సుమారు రూ. 88 లక్షలు)కి పెంచాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ నిర్ణయం, అమెరికాలో ఉన్న భారతీయులకు భారీ ఆర్థిక భారం కలిగించేలా భావించబడుతోంది. అయితే, ట్రంప్ వివరించారు, అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని ఈ చర్య ద్వారా కోరుతున్నారని, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని, అలాగే ఇది టెక్ పరిశ్రమకు వ్యతిరేకంగా లేనని వెల్లడించారు. అమెరికాను భారతీయులు ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉన్నట్లు ఓ నివేదిక సూచిస్తుంది.

Details

టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో మంచి ఉద్యోగాలు

అక్కడ ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య, మెరుగైన జీవనశైలి, ఆర్థిక స్వేచ్ఛ, సాంకేతిక ఆవిష్కరణల్లో అగ్రస్థానం వంటి అంశాలున్నాయి. ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే అవకాశం కూడా భారతీయులను ఆకర్షిస్తున్నాయి. యూఎస్‌లో టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో మంచి ఉద్యోగాలు లభించడం, పెట్టుబడి అవకాశాలున్నటంతోనూ భారతీయులు అక్కడకు మళ్లిస్తున్నారు. కాగా, ట్రంప్‌ నిర్ణయాల కారణంగా అమెరికాలో భారతీయుల ప్రవాసం తగ్గటం గమనార్హం. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

Details

8శాతం తగ్గే అవకాశం

నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా ప్రకారం, జూన్‌లో అమెరికా సందర్శించిన భారతీయుల సంఖ్య 2.1 లక్షలు మాత్రమే, గత ఏడాది అదే సమయంలో 2.3 లక్షలు ఉండగా, ఈసారి 8 శాతం తగ్గుదల నమోదైంది. జులైలో కూడా గత ఏడాదితో పోలిస్తే 5.5 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయులను విదేశాలపై అధికంగా ఆధారపడకుండా, దేశానికి స్వీయాభిమానంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. భారత్ "విశ్వబంధు" స్ఫూర్తితో అగ్రస్థానంలో నిలబడాలని, ఇతర దేశాలపై ఆధారపడితే అభివృద్ధి విఫలమవుతుందన్న వాస్తవాన్ని గుర్తుచేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా ఉండాలనేది మోడీ వ్యాఖ్యల ప్రధాన సారాంశం.