LOADING...
'World-changing' threat: సముద్రం లోపల UFOలు? అమెరికా తీరాలపై వింత కదలికలు.. శాస్త్రవేత్తలు,నేవీ అధికారులు షాక్!
శాస్త్రవేత్తలు,నేవీ అధికారులు షాక్!

'World-changing' threat: సముద్రం లోపల UFOలు? అమెరికా తీరాలపై వింత కదలికలు.. శాస్త్రవేత్తలు,నేవీ అధికారులు షాక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తీరప్రాంతాల దగ్గర ఇటీవల అనేక రహస్యాత్మక దృశ్యాలు కనిపించడం శాస్త్రవేత్తలతో పాటు రక్షణ శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించింది. ప్రజాదరణ పొందిన'ఎనిగ్మా'అనే UFO ట్రాకింగ్ యాప్ వేలాదిగా గుర్తించబడని నీటి లోపు వింత వస్తువులు(USOs-Unidentified Submersible Objects)గురించి రిపోర్టులు నమోదు చేసింది. ఈ వస్తువులు సముద్రంలోకి మునిగిపోవడం లేదా నీటి లోపల నుండి బయటకు రావడం వంటివి ఎటువంటి ఆనవాళ్లు లేకుండా జరుగుతున్నాయని చెబుతున్నారు. 2022లో ప్రారంభమైన ఎనిగ్మా యాప్ ప్రపంచవ్యాప్తంగా UFOలు,USOలకు సంబంధించిన 30,000 కంటే ఎక్కువ రికార్డులను సేకరించింది. తాజా విశ్లేషణలో ఆగస్టు నాటికి అమెరికా తీరానికి 10 మైళ్ళ లోపు 9,000 కంటే ఎక్కువ దృశ్యాలు నమోదయ్యాయని,వాటిలో 500 మాత్రం 5 మైళ్ళ పరిధిలోనే ఉన్నాయని తెలిపింది.

వివరాలు 

సముద్రంలో పచ్చని వెలుగులు కదులుతున్న దృశ్యం

వాటిలో దాదాపు 150 రిపోర్టులు నీటిపై తేలుతూ లేదా నీటిలోకి మునిగిపోయిన వస్తువుల గురించి వివరించాయి. అమెరికాలో కాలిఫోర్నియా (389 కేసులు),ఫ్లోరిడా (306 కేసులు) ఈ రహస్య దృశ్యాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఒక వీడియోలో సముద్రంలో పచ్చని వెలుగులు కదులుతున్న దృశ్యం కూడా రికార్డయ్యింది. విడుదలైన మ్యాపుల్లో అమెరికా తూర్పు,పశ్చిమ తీరాల వెంట దృశ్యాల గుంపులు గణనీయంగా కనిపిస్తున్నాయి. ఇక,చాలా UFO దృశ్యాలు తప్పుగా గుర్తించడం లేదా ఆప్టికల్ మాయగా భావించినా, మాజీ అమెరికా నేవీ రియర్ అడ్మిరల్ టిమ్ గల్లాడెట్ మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించాలని హెచ్చరించారు.

వివరాలు 

ప్రపంచాన్ని మార్చే పరిణామం 

ఆయన న్యూ యార్క్ పోస్ట్ తో మాట్లాడుతూ.."గుర్తించలేని వస్తువులు అమెరికా జలప్రాంతాల్లోకి ప్రవేశిస్తుండగా,రక్షణశాఖ దీనిపై పెద్ద హెచ్చరిక జారీ చేయకపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వానికి ఈఅనుమానాస్పద ఘటనలపై మరింత సమాచారం ఉండి దాన్ని ప్రజలతో పంచుకోవట్లేదనే అనుమానం కలుగుతోంది"అని పేర్కొన్నారు. గాలిలో,నీటిలో రెండింటిలోనూ సులభంగా కదిలే ఈవస్తువులు నిజమైతే,అది ప్రపంచాన్ని మార్చే పరిణామం కావచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై చర్చ 2019 జూలైలో మొదలైంది.ఆసమయంలో 'యూఎస్‌ఎస్ ఓమాహా' అనే నౌక సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక గుర్తించలేని వస్తువు నీటిలో మాయమైంది.ఆ ఘటనకు సంబంధించిన వీడియోను పెంటగన్ తరువాత ధృవీకరించింది. ఆవీడియోలో ఆ వస్తువు నీటిలోకి మునిగినా ఎలాంటి ధ్వంసం లేకుండా లేదా నీటి చిమ్ము లేకుండా అదృశ్యమవడం కనిపించింది.