
Population decline: ప్రపంచ జనాభా తగ్గుదల.. 2100 నాటికి 100 మిలియన్ల తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ జనాభా వచ్చే దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ శతాబ్దంలోనే అది సంతృప్తి స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుదల దిశగా సాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2080 వరకు వృద్ధి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2080 వరకు ప్రపంచ జనాభా పెరుగుతూ సుమారు 10.8 బిలియన్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత తగ్గుదల ప్రారంభమవుతుంది. శతాబ్దాంతానికి జనాభా 10.2 బిలియన్లకు పడిపోవచ్చు. ప్రస్తుతం (2022లో) ప్రపంచ జనాభా 8 బిలియన్లను తాకింది. శతాబ్దం క్రితం కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.
Details
వృద్ధి-తగ్గుదల భిన్న ధోరణులు
జనాభా పెరుగుదల భారత్ వంటి దేశాలకు సమస్యగా మారగా, జపాన్ వంటి దేశాలు జనాభా పెరుగుదల కోసం కష్టపడుతున్నాయి. కనీసం మరో 55 సంవత్సరాల పాటు ప్రపంచ జనాభా తగ్గకపోవడం శుభవార్త. కానీ ఆ తర్వాతే తగ్గుదల శర వేగంగా ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Details
తగ్గుదల వెనుక కారణాలు
తగ్గుదల ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనిపించనుంది. మహిళల విద్య, సమాన హక్కులు పెరగడం వల్ల ఎక్కువ మంది కెరీర్ వైపు మొగ్గుతున్నారు. జీవన వ్యయం పెరగడం కూడా కుటుంబాలు పెద్దగా ఉండకపోవడానికి కారణమవుతోంది. హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన సమాజ శాస్త్రవేత్త స్టువర్ట్ గీటెల్-బాస్టెన్ మాట్లాడుతూ.. తక్కువ జననాల వెనుక కారణం "విరిగిపోయిన వ్యవస్థలు, దెబ్బతిన్న సంస్థలని అన్నారు. ప్రజలు తాము కోరుకున్నంతమంది పిల్లలను కనలేకపోతున్న పరిస్థితి ఇదే అసలు సంక్షోభమని పేర్కొన్నారు. ప్రపంచ జనాభా భవిష్యత్తు ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై పెద్ద ప్రభావం చూపనుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.