Page Loader
హమాస్‌కు షాక్.. X ఖాతాలను తొలగించేస్తున్నట్లు సీఈఓ లిండా యాకరినో ప్రకటన
X ఖాతాలను తొలగించేస్తున్నట్లు సీఈఓ లిండా యాకరినో ప్రకటన

హమాస్‌కు షాక్.. X ఖాతాలను తొలగించేస్తున్నట్లు సీఈఓ లిండా యాకరినో ప్రకటన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 12, 2023
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు ట్విట్టర్ X షాక్ ఇచ్చింది.ఈ మేరకు హమాస్ కు సంబంధించిన అకౌంట్లను తొలగించామని సీఈఓ లిండా యాకరినో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో హమాస్‌కు చెందిన వందలాది 'ఎక్స్‌' ఖాతాలు నిలిచిపోయాయి. హమాస్ దాడులు ప్రారంభించిన తర్వాత వేలాది సందేశాలను తొలగించామన్నారు. మరోవైపు కొన్నింటికి హానికరమైన సమాచారం అని తెలిసేలా సంకేతాలు పంపించినట్లు లిండా వివరించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ప్రమాదకరమైన సమాచారంపై తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై ఐరోపా సమాఖ్య ఉన్నతాధికారి ఆమెను అడిగారు. దీంతో ఆయా అకౌంట్లను నిలిపేస్తున్నట్లు తెలిపారు. నకిలీ, తప్పుదోవ పట్టించేలా ఉండే సందేశాలపై చర్యలు తీసుకుంటున్నామన్న లిండా, తమ వేదికలపై ఉగ్రవాద చర్యలను సహించేది లేదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Xలోని సమాచారాన్ని, సందేశాలను సమీక్షిస్తున్నాం : యాకరినో