Page Loader
రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి 
రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి

రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Apr 20, 2023
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

యెమన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 85మంది మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. గాయపడిన వారిలో 13మంది పరిస్థితి విషమంగా ఉందని సనాలోని హెల్త్ డైరెక్టర్‌ చెప్పారు. రంజాన్ చివరి రోజుల్లో వ్యాపారులు దాతృత్వ విరాళాల పంపిణీ చేస్తుంటారు. అయితే విరాళాల స్వీకరణకు భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగిందని హౌతీ నియంత్రణలో ఉన్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. విరాళాల కార్యక్రమాన్ని నిర్వహించిన ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యెమన్‌లో తొక్కిసలాట దృశ్యాలు