LOADING...
UAE: యోగా కేవలం సాధన కాదు, స్పోర్ట్స్ కూడా.. యూఏఈ అధికారిక గుర్తింపు దిశగా అడుగు!
యోగా కేవలం సాధన కాదు, స్పోర్ట్స్ కూడా.. యూఏఈ అధికారిక గుర్తింపు దిశగా అడుగు!

UAE: యోగా కేవలం సాధన కాదు, స్పోర్ట్స్ కూడా.. యూఏఈ అధికారిక గుర్తింపు దిశగా అడుగు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) యోగా లేదా యోగాసనాన్ని కేవలం ఆరోగ్య సాధన, జీవనశైలిగా కాకుండా పోటీ క్రీడగా (Competitive Sport) గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది. యోగా సాధనను అధికారిక క్రీడగా మలచే ప్రయత్నం చేస్తూ, యూఏఈ ప్రభుత్వం దీని కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ద నేషనల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, ఈ నిర్ణయం భారతదేశంతో యూఏఈకి ఉన్న సాంస్కృతిక బంధాలు, అక్కడి భారతీయ ప్రవాసుల ప్రభావం కారణంగా తీసుకున్నదిగా తెలుస్తోంది. యూఏఈ క్రీడా రంగాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా, యోగా ద్వారా అంతర్జాతీయ వేదికపై తమ ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Details

అవసరమైన మార్గదర్వకాలు, నియమ నిబంధనలు రూపొందించేందుకు కృషి

దీనిని సాధించేందుకు యూఏఈ క్రీడాశాఖ పరిధిలోని 'యూఏఈ యోగా కమిటీ' ఆధ్వర్యంలో ఒక జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందిస్తోంది. యోగా పోటీ క్రీడగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు రూపొందించేందుకు ఈ కమిటీ కృషి చేస్తోంది. ఈ క్రమంలో యూఏఈ 2025లో ఫుజైరాలో జరిగే 6వ ఆసియన్‌ యోగాసన ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ ద్వారా యోగా పోటీ క్రీడగా ఉన్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించడమే లక్ష్యం. మొత్తం మీద, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం యోగా‌ను ఆరోగ్య సాధన నుండి క్రీడా ప్రపంచానికి తీసుకెళ్తూ, దానిని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందే దిశగా తీసుకెళ్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.