Loading...
UAE jobseeker visa will benefit Indians: జాబ్ ఆఫర్ లేకపోయినా యూఏఈ వెళ్లొచ్చు.. ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్
జాబ్ ఆఫర్ లేకపోయినా యూఏఈ వెళ్లొచ్చు.. ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్

UAE jobseeker visa will benefit Indians: జాబ్ ఆఫర్ లేకపోయినా యూఏఈ వెళ్లొచ్చు.. ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ ఉద్యోగార్థులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) బంపరాఫర్‌ ప్రకటించింది. స్థానికంగా స్పాన్సర్ ఎవరూ లేకపోయినా యూఏఈకి వచ్చి ఉద్యోగం వెతుక్కునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం 60, 90, 120 రోజుల కాల వ్యవధితో సింగిల్ ఎంట్రీ వీసాలను అందించనుంది. దీంతో అర్హత కలిగిన భారతీయ ఉద్యోగార్థులు ముందుగానే చేతిలో జాబ్ ఆఫర్ లేకపోయినా యూఏఈకి వెళ్లి ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఈ వీసాతో యూఏఈలో ఉన్న సమయంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించడంతో పాటు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నియామక ప్రక్రియలోనూ పాల్గొనవచ్చు. ఈ మేరకు ఎమిరేట్స్ ప్రభుత్వం వివరాలను వెల్లడించింది.

వివరాలు

మరి ఈ వీసాలకు ఎవరు అర్హులు?

యూఏఈ జాబ్‌సీకర్ వీసా (UAE Jobseeker Visa) కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ వీసా మంజూరు చేయరు.

దరఖాస్తుదారుల విద్యార్హతలు, నైపుణ్యాల స్థాయి, ఆర్థిక వనరులను పరిశీలించిన తర్వాతే యూఏఈ ప్రభుత్వం వీసాలను జారీ చేస్తుంది.

యూఏఈ మానవవనరుల విభాగం నైపుణ్య వర్గీకరణ ప్రకారం.. దరఖాస్తుదారులు 1, 2, 3 నైపుణ్య స్థాయుల్లో ఏదో ఒకదాన్ని కలిగి ఉండాలి.

అలాగే ప్రపంచంలోని టాప్ 500 విశ్వవిద్యాలయాల్లో గత రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు

విద్యార్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది

యూఏఈలో వీసా చెల్లుబాటు అయ్యే కాలంలో తమ ఖర్చులను భరించేందుకు తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని దరఖాస్తుదారులు నిరూపించాలి.

ఇక దరఖాస్తు సమయంలో కనీసం 6 నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌పోర్ట్, తాజా ఫొటోలు, ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT