Page Loader
Ukrain: ఉక్రెయిన్ రక్షణ మంత్రిని తొలగించిన జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ రక్షణ మంత్రిని తొలగించిన జెలెన్‌స్కీ.. రుస్టెమ్ ఉమెరోవ్ నియామకం

Ukrain: ఉక్రెయిన్ రక్షణ మంత్రిని తొలగించిన జెలెన్‌స్కీ

వ్రాసిన వారు Stalin
Sep 04, 2023
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక వైపు రష్యాతో ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ని బర్త్ రఫ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో రుస్టెమ్ ఉమెరోవ్ నియమించినట్లు జెలెన్‌స్కీ తన అధికారిక టెలిగ్రామ్ ఖాతాలో తెలిపారు. అవినీతి ఆరోపణలో నేపథ్యంలో ఒలెక్సీ రెజ్నికోవ్‌పై వేటుపడినట్లు తెలుస్తోంది. మిలిటరీ, సమాజం రెండింటితోనూ మంత్రిత్వ శాఖకు కొత్త విధానాలు అవసరమని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. ఉమెరోవ్ ప్రతిపక్ష హోలోస్ పార్టీకి చెందిన నేత. సెప్టెంబర్ 2022 నుంచి ఉక్రెయిన్ స్టేట్ ప్రాపర్టీ ఫండ్‌ చీఫ్‌గా ఉన్నారు. యూఎన్ మధ్యవర్తత్వంతో ధాన్యం ఒప్పందంపై రష్యాతో జరిగిన చర్చల్లో ఉక్రేనియన్ ప్రతినిధి బృందంలో ఉమిరోవ్ ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నూతన రక్షణ మంత్రిగా రుస్టెమ్ ఉమెరోవ్ నియామకం